మంత్రుల బురద బాత్.. తరువాత షవర్ బాత్

Update: 2015-07-15 12:01 GMT
    తెలంగాణలో బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కానీ అక్కడ నీరు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో తీరమంతా బురదబురదగా మారింది. . పాపం తెలంగాణ మంత్రులు అక్కడ స్నానానికి వెళ్లి ఆ బురదలోనే స్నానం చేసి ఆ తరువాత షవర్ బాత్ లు చేస్తున్నారు. మంత్రి జోగు రామన్న, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, బాపురావు తదితరులు పుణ్యస్నానం ఆచరించారు. బురద నీటిలోనే మంత్రి జోగు రామన్న తదితరులు స్నానం చేయవలసి వచ్చింది. జోగు రామన్న, ఎంపీ నగేష్ అలాగే బురద నీటిలో పుణ్యస్నానం చేశారు. ఆ తర్వాత వీఐపీ ఘాట్‌కు వచ్చి షవర్ బాత్ చేశారు.

    పైగా ఘాట్లలో సరిపోయేంత నీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. పలు పనులు అసంపూర్తిగానే నిలిచాయి. అన్ని ఘాట్లలోను పూర్తిస్థాయిలో నీళ్లు లేవు. దీంతో, ఒకే ఘాట్‌లోనే చాలామంది స్నానం చేస్తున్నారు. దీంతో నీరు బురదమయమవుతోంది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు కూడా లేవు. ఏర్పాట్లపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News