సమ్మెకు రెడీ అవుతున్న ఉద్యోగ సంఘాలు

Update: 2021-01-25 05:50 GMT
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలికి నిరసనగా ఉద్యోగసంఘాలు సమ్మెకు రెడీ అవుతున్నాయి. సోమవారం పంచాయితీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పాటు ఉద్యోగసంఘాలు సుప్రింకోర్టులో కేసులు వేశాయి. ఒకవేళ విచారణలో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఓకే. అలా కాకుండా ఎన్నికల నిర్వహణనే సుప్రింకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తే అప్పుడు ఉద్యోగులు సమ్మెకు రెడీ అవుతున్నారు.

ఇదే విషయాన్ని ఉద్యోగసంఘల నేతలు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా ముందు స్సష్టంగా చెబుతున్నారు. తాము ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదని అంటున్నారు. అయితే కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చెబుతున్నట్లు వారంతా గట్టిగా చెబుతున్నారు. తమ డిమాండ్లపై చర్చించేందుకు ఇఫ్పటివరకు నిమ్మగడ్డ సానుకూలంగా లేని విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాల నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు నిర్వహించుకుండా చోద్యం చూస్తు కూర్చున్న నిమ్మగడ్డ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే జరిగే నష్టం కూడా ఏమీ లేదని నేతలంటున్నారు.  కరోనా వైరస్ లాంటి సామాజికసమస్యలు ఏవీ లేనపుడేమో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న నిమ్మగడ్డ కరోనా వైరస్ కాలంలో ఎన్నికల నిర్వహణకు ఎందుకింతగా హడావుడి పడుతున్నారంటూ నిలదీస్తున్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను జనాలకందరికీ వేసేంతవరకు ఆగమని కూడా తాము అడగటం లేదని నేతలంటున్నారు. కేవలం తాము వ్యాక్సినేషన్ వేసుకుంటే కాస్త ధైర్యంగా ఉంటుందన్నారు. ఎన్నికలు జరిగిన బీహార్, కేరళ, తెలంగాణాల్లో తర్వాత కరోనా వైరస్ కేసులు పెరిగిన విషయాన్ని నిమ్మగడ్డ ఎందుకు మాట్లాడటం లేదంటూ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నిమ్మగడ్డ-ప్రభుత్వం మధ్య ఏమి జరుగుతోందో తమకు అవసరం లేదన్నారు. తమ ఉద్యోగుల ప్రాణాల రక్షణను మాత్రమే తాము ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ ఓటర్లజాబితాపై హైకోర్టులో కూడా కేసులు పడ్డాయి. మరి సోమవారం కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే.
Tags:    

Similar News