చంద్రబాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు

Update: 2020-02-23 13:03 GMT
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేజేతులారా తప్పు చేస్తూ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. తన రాజకీయ జీవితానికి సమానమైన వయసు గల యువ సీఎం జగన్ చేతిలో అవమానకరమైన ఓటమిని జీర్ణించుకొన్న బాబు తాజాగా వేస్తున్న తప్పటడుగులే ఆయనకు శాపంగా మారుతున్నాయి. ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయన్న చర్చ సాగుతోంది.

అమరావతి లొల్లిని టేకప్ చేసి చంద్రబాబు తప్పు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. అక్కడ తవ్వితే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ను సీఎం జగన్ బయటకు తీయడంతో కక్కలేకమింగలేక ఇప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతున్నారు. చంద్రబాబే కాదు.. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ టీడీపీ నేతలు కూడా ఇరుక్కున పరిస్థితి మనం కళ్లారా చూశాం.

ఇవే కాదు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించే కాలం వచ్చింది. బాబు అవినీతిని తవ్వితీసే పనిలో జగన్ పడ్డారు. తన పచ్చ మీడియాతో విశృంఖలంగా జగన్ పై అవాస్తవాలు, అభూతకల్పనలు చేస్తున్న చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వం తాజాగా ఈఎస్ఐ కుంభకోణాన్ని బయటకు తీసింది. ఇఎస్ఐ కుంభకోణంలో నాటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. సిట్ విచారణతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వంపై బాబు ప్రోత్సాహంతో ఒంటికాలిపై లేచిన అచ్చెన్న ఇప్పుడు మౌనముద్ర దాల్చారు. దాదాపు 1000 కోట్ల ఈ కుంభకోణంలో చంద్రబాబును కూడా లాగేలానే కనిపిస్తోంది.

ఇలా జాతీయ రాజకీయాలను ఒకప్పుడు ఊపు ఊపిని పెద్దమనిషి రాజకీయంగా వేస్తున్న తప్పటడుగులు.. దమ్ముంటే విచారణ జరిపించమని భీషణ ప్రతిజ్ఞలకు జగన్ సర్కారు సీరియస్ గా స్పందించి విచారిస్తోంది. ఇందులో నిజాలు వెలుగుచూస్తూ చంద్రబాబు, ఆయన అనుయాయుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. లేనిపోని రాజకీయం చేస్తూ చంద్రబాబు టీడీపీని నిండా ముంచేస్తున్నారన్న చర్చసాగుతోంది.

    

Tags:    

Similar News