అయన అత్త గారికి కూడా పదవిచ్చాం ... బాబు పై జగన్ సెటైర్లు !

Update: 2019-12-11 07:29 GMT
ఏపీ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. సమావేశాలు మొదలైన మొదటి రోజు నుండే వైసీపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. దీనితో మూడు రోజులుగా అసెంబ్లీ రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు సంయమనం కొల్పోయిన చంద్రబాబు స్పీకర్‌ ను మార్యాదగా ఉండదంటూ కామెంట్ చేయడంతో సభ లో గందరగోళం మొదలైంది. మర్యాదగా మాట్లాడాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. చంద్రబాబు తనను బెదిరించేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. వెంటనే వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని సూచించారు. స్పీకర్ ను పట్టుకుని మర్యాదగా ఉండదని అనడం కరెక్ట్ కాదన్నారు. స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదన్నారు.

ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని చంద్రబాబుని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గౌరవంగా ప్రవర్తించాలన్నారు. అలాగే వైసీపీ నేతలంతా స్పీకర్ ను అగౌరవపరిచిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. అయితే, స్పీకర్… చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞత కే వదిలేస్తున్నాని చెప్పి సభను కొనసాగించారు.

ఆ తరువాత నామినేటెడ్ పదవుల అలాట్‌మెంట్ గురించి మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి .. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు ఇచ్చినవారి పేర్లు ఒక్కొక్కటి చదువుతూ ఉండగా మధ్యలో లక్ష్మీ పార్వతీ పేరు వచ్చిన తరుణంలో , ఆమెను తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌గా నియమించామని చెప్పిన జగన్, ఆమె.. ఆయన అత్తగారే అంటూ చంద్రబాబు  పై సెటైర్ వేశారు. ఈ సమయంలో వైసీపీ సభ్యలు బల్లలు చరుస్తూ సభలో నవ్వులు పూయించారు.


Tags:    

Similar News