లడ్డూలాంటి నిర్ణయం.. ఇకపై కోరినన్ని లడ్డూలు
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నంతనే మొదట గుర్తుకు వచ్చేది స్వామివారు అయితే.. ఆ వెంటనే గర్తుకు వచ్చేది ఆయన ప్రసాదమైన లడ్డూనే. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా... లడ్డూ ప్రసాదం కొరతను తీర్చే విషయంలో మాత్రం ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం పెద్దగా ప్రయత్నించలేదు. ఎప్పుడు చూసినా లడ్డూల కోసం కొరతనే.. స్వామి వారి దర్శనం కాకున్నా.. స్వామి వారి లడ్డూలు లభిస్తే చాలు.. దర్శనమైనంత సంబరానికి గురవుతుంటారు భక్తులు.
అలాంటి స్వామి వారి లడ్డూలకు సంబంధించి లడ్డూలాంటి తీపివార్తనుచెప్పింది టీటీడీ. శ్రీవారి ఆలయం బయట రూ.12 కోట్లతో కొత్తగా బూందీపోటును నిర్మించారు. దీన్ని తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ లడ్డూ పోటుతో రోజుకు ఆరు లక్షల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే సామర్థ్యం ఉంది. దీంతో.. స్వామి వారి లడ్డూ ప్రసాదం కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
భక్తులు తాము కోరుకున్నన్ని లడ్డూల్ని పొందేందుకు వీలు కలుగుతుంది. త్వరలోనే భక్తులు కోరుకున్న సంఖ్యలో లడ్డూలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. స్వామి వారి భక్తులకు ఇంతకు మించిన శుభవార్త ఇంకేం ఉంటుంది చెప్పండి.