మీడియాకు షాకిచ్చిన జగన్ సర్కార్

Update: 2020-02-24 12:20 GMT
గతంలో భూమిలేని దళితులకు కేటాయించిన భూములను వైసీపీ స్వాధీనం చేసుకుందని ఇటీవల వివిధ వార్తపత్రికలలో వచ్చిన కథనాలపై జగన్ సర్కారు సీరియస్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా రాసిన పత్రికలపై పరువు నష్టం దావా వేయాలని తాజాగా సీఎం జగన్ తన రాజకీయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఆదేశించారు.

దీంతో జగన్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా దళితుల భూములపై తప్పుడు వార్తలు రాసిన మీడియాపై పరువు నష్టం కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లందరికీ సర్కులర్లు పంపారు. దీంతో తప్పుడు కథనాలు రాసిన మీడియా ఉలిక్కిపడింది.

ఇళ్ల స్థలాలు వాడుకోలేని వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానిక స్థలాలు ఇచ్చారు. దానిని ప్రభుత్వం వివిధ జిల్లాల్లో అర్హులైన పేదలకు పంచింది. ఈ  చారిత్రక ఇళ్ల స్థలాల పంపిణీని కూడా కొన్ని మీడియా సంస్థలు అభాసుపాలు చేయడం.. వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేలా కథనాలు రాయడంపై ప్రభుత్వం ఆగ్రహించింది. దళితుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నట్టు మీడియా రాయడంపై చర్య తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు ఈ వార్తలను ఖండిస్తూ ప్రవీణ్ ప్రకాష్, కలెక్టర్లు మీడియా సమావేశం కూడా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

తప్పుడు కథనాలు రాసిన మీడియాకు వాస్తవాలు తెలిసేలా ఆ భూ బాధితులను అందరినీ ఆహ్వానించి వైసీపీ సర్కారు అలా చేయలేదని వివరణ ఇప్పించడానికి రెడీ అయ్యింది. స్వతహాగానే తమ భూములు ఇచ్చామని ప్రభుత్వం లాక్కోలేదని దళితులు వివరణ కూడా ఇచ్చారు.  పత్రికల బండారం బయటపెట్టేందుకు ప్రభుత్వం భూములిచ్చిన దళితుల ప్రెస్ కాన్ఫరెన్స్ కు తీసుకురావడం సంచలనమైంది. ఈ విషయంలో తప్పుడు కథనాలు రాసిన మీడియాను ఇరుకున పెట్టేందుకు వైసీపీ సర్కారు రెడీ కావడం మీడియాకు గట్టి షాక్ లా పరిణమించింది.


Tags:    

Similar News