జగన్ ప్లాన్:ఎంత రచ్చయితే అంత లాభం..
గుంటూరులో వైఎస్ జగన్మోహనరెడ్డి చేయదలచుకున్న ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం దీక్ష చేయదలచుకున్న ఆయన 26న ముహూర్తం పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వినాయక నిమజ్జనం, ఆస్పత్రి స్కూళ్లు ఉన్న ప్రాంతాలు అనే మిషమీద పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి కూడా పాఠకులకు తెలుసు. అయితే.. పోలీసులు అనుమతి తిరస్కరించడంతో ఈ రగడ ముగిసిపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే.. అసలు రచ్చ ఇప్పుడే ప్రారంభం అవుతోంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా.. దీక్ష దీక్షే.. పోరాటం పోరాటమే.. ఉద్యమం ఉద్యమమే.. అన్న తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉండడమే ఇందుకు నిదర్శనం.
గుంటూరులో జగన్ తలపెట్టిన దీక్ష రచ్చరచ్చగా మారిపోతోంది అనడం కంటె ప్రభుత్వమే దీన్ని అలా మార్చివేస్తున్నదంటే బాగుంటుంది. ఇదివరకు కూడా జగన్ దీక్షలకు అనుమతుల విషయంలో పలు చికాకులు ఎదురయ్యాయి. సహజంగానే ఇలాంటి పరిణామాలు ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నదనే మాట రావడానికి అవకాశం ఇస్తాయి. ఈసారి ఆమరణ దీక్ష విషయంలో వైకాపా చాలా జాగ్రత్తగా వ్యవహరించిందనే చెప్పాలి.
గుంటూరులో మూడు స్థలాల్లో దీక్ష నిర్వహించుకోవడానికి ఎంపిక చేసి.. వాటిలో ఏదో ఒకచోట చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ వారు చాలా కాలం ముందే పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే ఆ మూడూ కాకుండా మరో స్థలం చూసుకోవాలని పోలీసులు చెప్పారు. ఉల్ఫ్ హాల్ గ్రౌండ్ అనే ఒక ప్రెవేటు స్థలాన్ని లీజుకు తీసుకుని, దానికి అవసరమైన రుసుములుకూడా చెల్లించి, ఆ పత్రాలతో సహా అక్కడ దీక్ష జరపడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే జగన్ బ్యాచ్ మాత్రం.. ఈ విషయంలో ఎంత రచ్చ అయితే తమకే అంత ఎడ్వాంటేజీ అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ దీక్ష అంటే ప్రభుత్వం భయపడుతున్నట్లుగా.. ఇలాంటి పోలీసు చర్యలు, ఆంక్షల వల్ల ప్రజల్లోకి సంకేతాలు వెళతాయని ఆ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. ప్రభుత్వమే తమకు ప్రచారం కల్పిస్తున్నదనేది వారి ఆలోచన. నిజానికి బుధవారం నాడు పలు విడతలుగా వైకాపా నాయకులు గుంటూరుపోలీసులతో జరిపిన చర్చలు వాగ్వాదాల పర్యవసానంగా.. ఎస్పీ దీక్షకు కొంత సానుకూల వైఖరితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీక్షకు ఇంకా రెండు రోజుల గడువుండగా.. ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి