ప్రధాని ముఖ్యం కాదు..హోదాయే లక్ష్యం

Update: 2018-08-17 06:01 GMT
వచ్చే ఎన్నికలలో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అవుతారా..లేక రాహుల్ గాంధీ ఉంటారా అన్నది తమకు  ప్రధానం కాదని, ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చిన వారి వెనుకే ఉంటామని వైఎస్ ఆర్ పార్టీ నాయకుడు - వైఎస్. జగన్ మోహన రెడ్డి స్పష్టం చేసారు.  " ప్రధాని ఎవరు అన్నది మాముందున్న ప్రశ్న కాదు రాష్ట్రనికి ప్రత్యేక హోదా ఎలా అన్నదే మా లక్ష్యం " అని ఆయన స్పష్టం చేసారు.

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని ఉత్తారాంధ్ర జిల్లాలో ప్రవేశించిన జగన్ మోహన రెడ్డి ఓ జాతీయ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వులో పలు అంశాలను వెల్లాడించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనాధల మారిందని - అభివ్రుద్ది చేయాల్సిన చంద్రబాబు అధికారం అనుభవిస్తున్నారు తప్పా పట్టించుకోవాడం లేదని మండిపడ్డారు. ఢీల్లిలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందా - యుపిఏ అధికారంలోకి వస్తుందా - ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా అన్నది తమ‌కు ముఖ్యం కాదన్నారు. అక్కడ అధికారంలోకి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ కు రావల్సినవన్నీ సాధించుకుంటామన్నారు.
 
భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్లు కాపురం చేసిన చంద్రబాబు నాయుడు హోదా అంశాన్ని తుంగలో తోక్కారన్నారు. రాజ్యంగ బద్దమైనా పదవులకు పోటి ఉండరాదనే ఉద్దేశ్యంతో ఎన్‌ డియే రాష్ట్రపతి అభ్యర్ది రామ్‌ నాధ్ కోవింద్‌ కు  మద్దుతు ఇచ్చామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు."ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ పదవికి కూడా కోడేల శివప్రసాద్ రావుకు మద్దతు ఇచ్చాము. ఆయన తెలుగుదేశం శాసన సభ్యుడు. రాజ్యంగ బద్దమైన పదవులకు పోటి ఉండడం ప్రజాసౌమ్యంలో అంత మంచిది కాదు " అని జగన్ మోహన రెడ్డి స్పష్టం చేసారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు తెలుగుదేశం పార్టీకి - బిజేపీ - పవన్ కల్యాణ్ చేయూతనివ్వడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఈ సారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని ఆయన పన్నాగాలను  ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే స్దితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ - ఏ కులమూ ఆనందంగా లేరని ప్రతీ ఒక్కరిని చంద్రబాబు నాయుడు వంచిస్తున్నారని జగన్ అన్నారు. తాను చంద్రబాబు నాయుడిలా సాధ్యంకాని హామీలు గుప్పించి పదవిలోకి రావలని అనుకోవటం లేదని. అదే అయితే 2014లో రైతు రుణమాఫీ ప్రకటించి అధికారంలోకి వచ్చేవాళ్లమని చెప్పారు. తాను చేస్తున్న పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలు - కన్నీళ్లు - అవేదనలు తెలుస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు తమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News