జ‌గ‌న్‌ - చంద్ర‌బాబు - ప‌వ‌న్ ముఖ్యంకాదు..ఆరు కోట్ల ఆంధ్రుల హ‌క్కు మోడీ జీ!

Update: 2021-03-24 09:15 GMT
పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో జ‌మ్ముక‌శ్మీర్‌.. పుదుచ్చేరి రాష్ట్రాల‌కు సంబంధించిన ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో ఏపీకి చెందిన టీడీపీ - వైసీపీ ఎంపీలు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై కేంద్రా న్ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి ఇచ్చిన స‌మాధానం... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదు. ఇక‌.. ప్ర‌త్యేక ప్యాకేజీ కింద కూడా నిధులు ఇచ్చేశాం.. సో.. ఇక ఇవ్వాల్సింది ఏమీలేద‌న్నారు. ఈ స‌మాధానం..  స‌ర్వ‌త్రా విస్మ‌యానికి దారితీసింది. పార్ల‌మెంటు సాక్షిగా .. గ‌త ప్ర‌ధాని మ‌న్ మోహ‌న్ సింగ్ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని మోడీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత నెర‌వేరుస్తామ‌ని 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తిలో జ‌రిగిన స‌భ‌లో మోడీ ప్ర‌స్తావించారు..

అంతేకాదు.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న మేనిఫెస్టోలోనూ పొందుప‌రిచింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు మాత్రం పార్ల‌మెంటు సాక్షిగా.. అన్నీ అబ‌ద్దాలే చెప్పిన కేంద్రం.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అడిగితే.. టీడీపీ గురించి - వైసీపీ గురించి - జ‌గ‌న్‌ - చంద్ర‌బాబుల గురించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చెబుతోంది. కానీ,  ఇది ఆరు కోట్ల ఆంధ్రుల హ‌క్కు అనే విష‌యాన్ని గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్రం చెబుతున్న ఈ ముగ్గురికీ ఉన్నది మూడు ఓట్లు మాత్ర‌మే.  కానీ, ఆరు కోట్ల ఆంధ్రులు బాగుండాలంటే.. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇదే విష‌యాన్ని మోడీ తిరుప‌తి స‌భ‌లోనూ ప్ర‌క‌టించారు. విడిపోయిన రాష్ట్రానికి - హోదా సంజీవ‌నిగా ప‌నిచేస్తుంద‌న్నారు. ఈ క్ర‌మంలో ఏపీలో బీజేపీ-టీడీపీ సంకీర్ణ స‌ర్కారును ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ మార్పుల వ‌ల్ల టీడీపీ... బీజేపీకి దూర‌మ‌య్యింది. ఒక‌వేళ అప్ప‌టి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నా.. ఇది కాదు ముఖ్యం.. ఏపీకి స్టేట‌స్ ఇస్తారా ?  లేదా? అని అడిగితే.. 14వ ఆర్థిక సంఘం వ‌ద్దంది కాబ‌ట్టి.. అని త‌ప్పు దానిపై నెట్టేస్తున్నారు. కానీ, స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఒక వ్య‌క్తి స‌మాచారం తెప్పించారు. దీని ప్ర‌కారం.. ``అది మా ప‌రిధిలో లేదు. అది నీతి ఆయోగ్ కి సంబంధించింది` అని ఆర్థిక సంఘం నుంచి స‌మాచారం అందింది.

మ‌రి దీనిని బ‌ట్టి.. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదాపై చెబుతున్న‌ది ఏంటి?  ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లాల్సిన పార్ల‌మెంటులోనే అబ‌ద్ధాలు చెబుతున్నారా?  మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.... ఆరు కోట్ల మంది ఆంధ్రుల‌కు న్యాయం చేసేది ఎవ‌రు? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది.  

కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు - కేంద్ర ప్ర‌భుత్వం అలా చేస్తుంటే.,. రాష్ట్రంలో బీజేపీ బ్యాచ్ మ‌రో రూపంలో క‌య్యాల‌కు రెడీ అవుతోంది. ``చంద్ర‌బాబే ప్యాకేజీ అడిగాడు. ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌ని.. అన్నాడు`` అని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ, వ‌ద్ద‌న‌డానికి బాబు.. ఇవ్వ‌న‌ని చెప్ప‌డానికి మీరు ఎవ‌రు? ఇది ఆరు కోట్ల మంది జ‌నాభాకు సంబంధించిన విష‌యం. కేవ‌లం ఇద్ద‌రు ముగ్గ‌రు మ‌ధ్య సంబంధించిన విష‌యాన్ని బీజేపీ ఎందుకు హైలెట్ చేసి - రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. ఇది క‌రెక్ట్ కాదు మోడీ జీ.. అని ఏపీ ప్ర‌జ‌లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇప్ప‌టికీ తేరుకోలేని విధంగా ఉన్న ఏపీని ఆదుకునేందుకు హోదా ఇచ్చేందుకు ఆలోచ‌న చేయండి మోడీ జీ.. అని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుతున్నారు.. ద‌య‌చేసి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వండి సార్‌.


Tags:    

Similar News