రామోజీరావు పుట్టిన రోజు వేళ బాబు అలా... జగన్ ఇలా...
తెలుగు నాట మీడియాకు విశేష ప్రాచుర్యం ఎపుడూ ఉంది. దాన్ని పీక్స్ కి తీసుకెళ్ళిన వ్యక్తిగా శక్తిగా ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుని చెప్పకోవాలి. ఆయన మీడియా మొఘల్ గా ఘనమైన కీర్తిని ఆర్జించారు. దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలంగా తెలుగు నాట రాజెకీయాలను ఆయన ప్రభావితం చేస్తున్నారు అని చెప్పుకోవాలి.
రామోజీరావుకు మీడియాతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఆయన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ ని 2016లో దక్కించుకున్నారు. దేశంలో రాజకీయ దిగ్గజాలకు ఆయన అంటే తెలుసు. ఆయన కోసం ఏవరైనా ఆయన వద్దకు వచ్చి కలవాల్సిందే. అంతటి స్థాయిని అందుకున్న రామోజీరావు తానుగా ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు కానీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు నిత్యం ఎక్కడో ఒక చోట పార్టీలు జపిస్తాయి.
అలా ఆయన్ని రాజకీయాల్లో ఎప్పటికపుడు సజీవంగా ఉంచుతాయి. ఇవన్నీ పక్కన పెడితే రామోజీరావు 1936లో నవంబర్ 16న క్రిష్ణా జిల్లా పెదపారపూడిలో జన్మించారు. ఆయన ఇంతటి ఎత్తుకు ఎదగడం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారు అని చెబుతారు.
రామోజీరావు పుట్టిన రోజున ఒక విశేషం కూడా ఉంది. నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం. ఇది యాధృచ్చికం అయినా ఒక మీడియా మొఘల్ బర్త్ డే రోజీ ఇది కావడం విశేషంగానే చూడాలి. రామోజీరావుకు ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. రామోజీరావు నిండు నూరేళ్ళూ అరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ సైతం రామోజీరావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన పత్రికారంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం, వైసీపీ అధినేత ఎపుడూ రామోజీరావు విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ దుష్ట చతుష్టయంతో కలిపి విమర్శలు చేసే జగన్ రామోజీరావుకు గ్రీటింగ్స్ చెప్పారా. అంటే ఆయన కూడా చెప్పారు. అయితే అది ఆయన స్టైల్ లో అని అంటున్నారు.
అదేలా అంటే బర్త్ డే కి ఒక రోజు ముందే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల మీద ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న లెక్కలు జమలు అన్నీ పరిశీలించారు. అదే విధంగా చిట్ ఫండ్ లో చిట్ పాడుకున్న మెంబర్ సొమ్ముని తీసుకెళ్ళి ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తున్నారు అన్న ఆరోపణల నేపధ్యంలో ఈ సోదాలు చేశారు.
మరి ఇది ఆరంభమా లేక ఇంకా కొనసాగిస్తారా ఏంటి అన్నది చూడాలి. ఏది ఎలా ఉన్నా బాబు గ్రీటింగ్స్ ఒకలా ఉంటే జగన్ మార్క్ గ్రీటింగ్స్ మరొకలా ఉన్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా ఈసారి రామోజీరావు బర్త్ డే విషేస్ ని టీడీపీ అధినాయకత్వం చెప్పి మరీ బాగా ప్రాచుర్యం లోకి తెచ్చింది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.