మరోసారి చిక్కుల్లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఆ ఫొటోతో రచ్చ
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న జాక్వెలిన్ చుట్టూ మరో వివాదం ముసిరింది.
తాజాగా సుకేష్ చంద్రశేఖర్ తో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా సుకేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ తో జాక్వెలిన్ ఉన్న ఫొటో బయటకు రావడంతో మళ్లీ ఆమె చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.
సుఖేష్ పై 200 కోట్ల కుంభకోణం ఆరోపణలున్నాయి. ప్రముఖ బిజినెస్ మ్యాన్ శివేందర్ సింగ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ సుకేష్ తో జాక్వెలిన్ ఫొటో బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. సుఖేష్ చంద్రశేఖర్ మధ్యంతర బెయిల్ పైనా విడుదలైన సమయంలో ఏప్రిల్-జూన్ కాలంలో ఈ ఫొటో తీసినట్లు చెబుతున్నారు.
జాక్వెలిన్ ను సుకేష్ చెన్నైలో దాదాపు 4 సార్లు కలిశాడని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అతడిని కలిసేందుకు జాక్వెలిన్ ప్రైవేట్ జెట్ ను కూడా ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.
మూడు సార్లు విచారణకు హాజరు కాని జాక్వలిన్ ఆ తర్వాత హాజరయ్యారు. ముఖేష్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పౌల్ పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరా ఫతేహి, జాక్వెలిన్ కు ఈడీ నోటీసులు పంపింది. సుకేష్ సహా మరో 13మంది రూ.200 కోట్ల మేర మోసం చేశారని అభియోగాలు నమోదయ్యాయి.