మార్ఫింగ్ ఫోటోల్ని ఇవాంకా ఎంత లైట్ తీసుకుందంటే?
రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం ఎప్పుడూ ఆసక్తికరమే. ఇప్పుడు అలాంటి పనే చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్. ప్రపంచానికే పెద్దన్న రాజ్యానికి అధ్యక్షుడైన తండ్రి.. అమెరికాలో మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ గా పేరున్న తనలాంటి మహిళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసిన వైనం ఆ స్థానంలో ఉన్న వారికి ఒళ్లు మండేలా చేయటం ఖాయం. అందుకు భిన్నంగా ఇవాంకా రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఇవాంకా కాళ్లపై కాళ్లు వేసి విలాసంగా తాజ్ దగ్గర ఫోటో దిగినట్లుగా.. తాజ్ దగ్గర ఇవాంకాతో కలిసి ఫోటో దిగినట్లుగా.. భారత పర్యటనకు వచ్చిన ఇవాంకాను సైకిల్ ఎక్కించుకున్నట్లుగా ఉన్న ఫోటోలతో పాటు.. మరిన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలే. వీటిని నటుడు కమ్ సింగర్ దిల్జిత్ దొసాంజ్ ఒక ట్వీట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో కూడిన ట్వీట్ ను ఇవాంకాకు ట్యాగ్ చేశారు. అనూహ్యంగా దీనికి ఇవాంకా స్పందించటం సంచలనంగా మారింది. అంతకు మించి ట్రెండింగ్ అయ్యింది.
మార్ఫింగ్ ఫోటోల్లో ఇవాంకా ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకున్నాడు. ‘‘నేనే ఆమెను తాజ్ వద్దకు తీసుకెళ్లా. అంతకంటే ఏం చేయగలను’’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఇవాంకా రిప్లై ఇచ్చారు. ‘‘నన్ను తాజ్ మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్.. దీన్ని నేనెప్పటికి మర్చి పోలేను’’ అంటూ కూల్ రిప్లై ఇచ్చారు. దీనికి సదరు గాయకుడికి మతి పోయింది. తాను సరదాగా మార్ఫింగ్ చేసిన ఫోటోలకు ఫైర్ కాకుండా ఇలా పాజిటివ్ రిప్లై ఇవ్వటం తో ఆశ్చర్యానికి గురైన అతడు.. ‘‘ఓ మైగాడ్.. థ్యాంక్స్ ఇవాంకా. ఇది ఫోటో షాప్ చేసిన ఫోటోలు కావని అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి లూథియానాకు రండి’’ అంటూ రిప్లై ట్వీట్ ఇచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో తిరుగుతున్న మరికొన్ని ఫోటోల్ని ఇవాంకా ట్వీట్ చేస్తూ.. ‘‘భారతీయ అభిమానులను అభినందిస్తున్నా’’ అంటూ ఫోటోషాప్ చేసిన మరిన్ని ఫోటోల్ని ఆమె షేర్ చేయటం తో.. ఇప్పుడీ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తమ ఫోటోల్ని మార్ఫింగ్ చేయటాన్ని సీరియస్ గా తీసుకుంటారు. అందుకు భిన్నంగా కూల్ గా రియాక్ట్ కావటం.. సానుకూలంగా స్పందించిన వైనంతో వాతావరణం వేడెక్కటం మానేసి అందుకు భిన్నంగా నవ్వులు పూయించేలా మారింది. ఏమైనా.. నెగిటివ్ ను పాజిటివ్ తో ఎలా కొట్టాలో ఇవాంకా కొత్త పాఠం నేర్పినట్లైంది.