మంత్రులు ఈటల, గంగుల మధ్య గ్యాప్ పెరిగిందా?

Update: 2020-07-07 09:00 GMT
టీఆర్ఎస్ కు కంచుకోట కరీంనగర్.  తెలంగాణలో రెండోసారి గెలిచిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉమ్మడి కరీంనగర్ కు పెద్దపీట వేశారు. ఏకంగా నాలుగు మంత్రి పదవులను ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

కేసీఆర్ మంత్రివర్గంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనూహ్యంగా చోటుదక్కించుకున్నాడు. ఇన్నాళ్లు కరీంనగర్ జిల్లా మంత్రిగా చక్రం తిప్పిన వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు దీంతో చెక్ పడింది. కరీంనగర్ జిల్లా కేంద్రం బాధ్యతలన్నీ మంత్రి గంగుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈటెల హైదరాబాద్, తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ కే పరిమితమైపోయారు.

ఒకనొక దశలో మంత్రి ఈటల రాజేందర్ పోస్టు ఊస్ట్ అవుతుందనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగింది. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గంగుల కమలాకర్  కావడం.. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే నేత కావడంతో ఈటెలను తొలగించి గంగుల తీసుకోవచ్చనే చర్చ సాగుతోంది.  అయితే కేసీఆర్ ఇద్దరికీ చాన్స్ ఇవ్వడంతో సందిగ్ధం వీడింది.

ఇప్పుడు మళ్లీ ఈటల, గంగుల మధ్య ఆగాధం పెరిగిందని కరీంనగర్ లో ప్రచారం మొదలైంది.ఈ మధ్య ఈటల కరీంనగర్ కు రావడమే మానేశారు. కరీంనగర్ జడ్పీ సమావేశాలకు వేర్వేరుగా హాజరయ్యారట.. గంగుల ఉదయం.. మధ్యాహ్నం ఈటల వచ్చి కలుసుకోలేకపోయారు. రాష్ట్రానికి మంత్రులైన వీరు తమ నియోజకవర్గాలకే పరిమితం కావడం చర్చనీయాంశమైంది.

అయితే ఈ వివాదాలకు తెరదించాలేనే ఇటీవల కరీంనగర్ కలెక్టరేట్ కు గంగుల స్వయంగా కారు నడుపుతూ ఈటెలను కూర్చుండబెట్టుకొని తీసుకొచ్చాడు. అయితే ఎంత చేసినా వీరిమధ్య కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతోందని కరీంనగర్ టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
Tags:    

Similar News