కుమారి అని పిలిస్తే కోపం రాదా?

Update: 2015-08-28 04:22 GMT
పెళ్లి కానివారిని "శ్రీమతి" అని సంబోదించడం ఎంత నేరమో, పెళ్లి అయిన వారిని "కుమారి" అని పిలవడం కూడా అంతే నేరం అంటున్నారు కేరళ మంత్రి పీకే జయలక్ష్మి! తాజాగా ఈ మేరకు ఆమె ఒక సర్క్యులర్ కూడా జారీచేశారు. కేరళ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి జయలక్ష్మి. అయితే ఈమెకు ఈ మధ్య తన చిన్ననాటి స్నేహితుడు అనీల్ తో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు కేరళ రాష్ట్ర సీఎం తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులూ అంతా హాజరయ్యారు. తనకు పెళ్లి అయ్యింది, ఆ విషయం ప్రపంచానికి తెలుసు... అయినా కూడా ఇంకా తనను "కుమారి" అని సంబోదిస్తున్నారు... అంటూ ఈమధ్య ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. తనను "శ్రీమతి" అని సంబోదించమని చాలా మందికి చాలా సార్లు చెప్పినా వినకపోవడంతో... ఇక ఎవరూ తనను అలా పిలవకూడదని ఒక సర్క్యులర్ జారీ చేశారు!

కాగా... ఈమద్య ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెళ్లికాని జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని "శ్రీమతి" అని సంబోదించిన స్పీకర్ సుమిత్ర మహజన్ పై అంతెత్తున లేచారు! తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఇకపై ఆ అవకాశం కూడా లేదని... ఇంకెప్పుడూ తనను శ్రీమతి అని పలవద్దని తెగేసి చెప్పేశారు. ఉమాభారతి రియాక్షన్ నుండి తేరుకున్న స్పీకర్ సారీ చెప్పి... సద్దుమణిగించారు. అంతవరకూ సరే కానీ... పెళ్లి అయిన తనని కుమారి అని సంబోదించడంపై సర్క్యులర్ జరీ చేయడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది!
Tags:    

Similar News