ఫ్రాన్స్ లో చర్చి ఫాదర్ తల నరికేశారు

Update: 2016-07-26 14:24 GMT
నిన్నమొన్నటి వరకూ ఇరాక్.. సిరియాలో మాత్రం ఉగ్రదాడుల గురించి తరచూ వినే వైనానికి భిన్నంగా ఇప్పుడు యూరప్ లోనూ తరచూ ఉగ్రదాడులు జరగటం ఆందోళన కలిగించేఅంశంగా చెప్పాలి. ప్రశాంతంగా ఉండే యూరోప్ లో ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రజలంతా అభద్రతతో బతకటమే కాదు.. ఏప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి. మొన్నికి మొన్న ప్రాన్స్ లో ఒక ఉన్మాది లారీని తీసుకొని 84 మందిని బలి తీసుకున్న ఘటన మర్చిపోక ముందే.. మరో దారుణం చోటుచేసుకుంది.

ఇద్దరు దుండగులు ఫ్రాన్స్ లోని ఒక చర్చిలోకి ప్రవేశించి పలువురిని బందీలుగా తీసుకోవటమే కాదు.. చర్చి ఫాదర్ ను.. ఇద్దరు సిస్టర్లను బంధించారు. అనంతరం చర్చి ఫాదర్ తల నరికేసిన ఉన్మాదులు ఆరాచకం సృష్టించారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిన్నపాటి కత్తితో ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. మారువేషాల్లో చర్చిలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దుండగులు బాంబులు.. తుపాకులు ఏమీ లేకున్నా.. చిన్న చిన్న ఆయుధాలతో ఎంత ఆరాచకం సృష్టించొచ్చు అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారని చెప్పాలి. దాడి జరిపింది.. ఉగ్రవాదులా? ఉన్మాదులా? అన్న అంశంపై స్పష్టత రాలేదు.
Tags:    

Similar News