అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ కు షాక్ తప్పదా ..ఆకాష్ -ఇషా అంబానీ కీలక నిర్ణయం!
కరోనా మహమ్మారి ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రతి రంగం పై పడింది. ఎదో ఒక విదంగా అన్ని రంగాలపై ప్రభావం చూపించడంతో మార్కెట్ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతుంది. అలాగే రాబోయే పరిణామాలని ఎదుర్కొంటు ముందుకు సాగిపోవడానికి ఇప్పటినుండే ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే .. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 40 ఏళ్లలోపు అద్భుతాలు సాధించిన 40మందితో కూడిన జాబితాను ఫార్చూన్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ ఏడాది కూడా ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసులు ఈషా అంబానీ, ఆకాష్ అంబానీలకి చోటు దక్కడం విశేషం. 28 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించారు. ఈషా, ఆకాశ్‌లతో పాటు బైజూస్ యాప్ బైజు రవీంద్రన్ కు ఈ జాబితాలో చోటు దక్కింది.
ఆయా రంగాల్లోని ప్రభావవంతమైన 40 ఏళ్ల లోపు వ్యక్తులని ఎంపిక చేసి ప్రతి సంవత్సరంఫార్చూన్ ఈ జాబితా సిద్ధం చేస్తుంది. ఈసారి ఏకంగా 5 విభాగాలకు .. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, ప్రభుత్వం, రాజకీయాలు, మీడియా అండ్ ఎంటర్టైన్‌మెంట్ .. విడిగా జాబితాలను విడుదల చేసింది. ఈషా, ఆకాష్, బైజు రవీంద్రన్ లకు టెక్నాలజీ విభాగం జాబితాలో చోటు దక్కింది. పూనావాలాకు హెల్త్ కేర్ విభాగంలో చోటు దక్కింది. జియోకు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోరసాయనాల వ్యాపారం భారీ లాభాల్లో ఉంది. 2016లో జియో రావడంతో మొబైల్ విప్లవం కీలక మార్పు చోటుచేసుకుంది. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆకాష్ 2014లో రిలయన్స్ సంస్థలో చేరారు. ఏడాది తర్వాత ఇషా జత కలిసింది. యేల్, స్టాన్ ఫోర్ట్ విశ్వవిద్యాలయాల్లో చదివిన ఇషా మొదట అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం మెకెన్సీలో పని చేశారు. ప్రస్తుతం ఈషా, ఆకాష్ రిలయన్స్ జియో బోర్డ్ సభ్యులుగా ఉన్నారు. ఇషా, ఆకాష్‌లు ఇటీవల జియోమార్ట్ ను లాంచ్ చేశారని, ఇది అమెజాన్, వాల్ మార్ట్ కు చెందిన ఫ్లిప్ కార్ట్ ను సవాల్ చేసే అవకాశం ఉందని ఫార్చ్యూన్ మేగజైన్ వెల్లడించింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీని పెద్ద ఎత్తున ఎలా విజయవంతం చేయాలో ప్రపంచానికి బైజూస్ రవీంద్రన్ నేర్పించారని ఫార్చూన్ తెలిపింది. బైజూస్ లక్షలాదిమంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఉపయోగపడిందని తెలిపింది.
వీరితో పాటుగా ఈ జాబితాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా గురించి ఫార్చూన్ ప్రస్తావిస్తూ అతిపెద్ద వ్యాక్సీన్ల తయారీ కంపెనీకి సీఈవోగా ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో షావోమీ ఇండియా ఎండీ మనుకుమార్ , సాఫ్టుబ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ నెహతా , టీడీ అమరిట్ ట్రేడ్ డీఎల్టీ హెడ్ సునయన తుతేజా, మావెరిక్ వెంచర్స్ ఎండీ అంబర్ భట్టాచార్య, పార్మ్-ఈజీ సహ వ్యవస్థాపకులు దావల్ షా, ధర్మిల్ సేథ్, ఏసీఎల్‌యూ చీఫ్ ప్రోడక్ట్ అండ్ డిజిటల్ ఆఫీసర్ దీపా సుబ్రమణియన్ లు ఉన్నారు.