వినతులేనా విన్న తర్వాత స్పందన ఉండదా?

Update: 2019-10-06 08:48 GMT
ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న మోడీ వద్దకు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వివిధ అంశాల్ని తీసుకొస్తుంటారు. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కానీ.. తాము అమలు చేస్తున్న పథకానికి చేయూత కానీ.. ఇంకేదైనా డెవలప్ మెంట్ యాక్టివిటీకి సంబంధించిన పనుల గురించి అడగటం.. వినతులు ఇవ్వటం చేస్తుంటారు.

మరి.. వినతుల్ని తీసుకునే మోడీ.. ముఖ్యమంత్రులు తనను అడిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? అన్నది ప్రశ్న. రాజకీయ వర్గాలు చెప్పే మాటల్ని చూస్తే.. ముఖ్యమంత్రులతో సమావేశమైన సందర్భంలో మోడీ చాలావరకూ గంభీరంగా ఉంటారని.. అదే సమయంలో కొన్ని ప్రశ్నల్ని అడగటం.. వాటికిచ్చే సమాధానాల్ని వినటం లాంటివి చేస్తారంటారు.

వినతుల గురించి  ప్రస్తావించినప్పుడు.. అలాగే లాంటి పదాల్ని వాడటమే తప్పించి.. ఎలాంటి హామీ ఆయన నోటి నుంచి రాదని చెబుతారు. కాకుంటే.. నిఘా వర్గాల నుంచి తనకు వచ్చిన కొంత సమాచారాన్ని మాత్రం ప్రస్తావించి.. ముఖ్యమంత్రుల్ని డిఫెన్స్ లో పడేలా చేస్తారని చెబుతారు. కేంద్రం నుంచి తమకు ఎలాంటి సాయం అందటం లేదన్న మాటల్ని ప్రస్తావించే వారికి.. వారి రాష్ట్రంలో జరిగే అవినీతి గురించిన వివరాల్ని వెల్లడించటం ద్వారా.. దుబారాను ఆరికట్టండి.. ఆ తర్వాత మిగిలిన విషయాలు చూడొచ్చన్న భావన కలిగేలా ఆయన తీరు ఉంటుందంటున్నారు. వినతులు వినటమే కానీ.. దాని మీద ఎలాంటి హామీ ఇచ్చే అలవాటు మోడీకి లేదంటారు.

ఈ కారణంతోనే.. మోడీని కలిసే ముఖ్యమంత్రులు.. తాము ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రస్తావించి.. తాము కోరిన డిమాండ్ల చిట్టాను చదివి వినిపిస్తారే తప్పించి.. ఇంకెలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండిపోతారు. సాధారణంగా ప్రముఖుల్ని కలిసిన సందర్భంలో వారి నోటి నుంచి వచ్చే మాటల్ని ఆ తర్వాత అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు. మోడీని కలిసిన వారెవరూ.. ఆయన నోటి నుంచి ఫలానా మాట వచ్చిందన్న మాటలేమీ చెప్పకపోవటానికి కారణం.. మాట్లాడటం కంటే ఎక్కువగా వినటానికే ప్రధాని ప్రాధాన్యత ఇవ్వటంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News