ఓటరు కార్డు రూపు మారుతోందా?

Update: 2020-12-13 06:30 GMT
ఓటరు కార్డు రూపం మారనుంది. ఇప్పటివరకు అందిస్తున్న రీతిలో కాకుండా.. డిజిటల్ రూంలో జారీ చేయనున్నారా? అంటే.. ఆ దిశగా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. డిజిటల్ రూపంలో ఓటరు కార్డును జారీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విధానంలో ఓటరు కార్డు మరింత స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఓటరు ఫోటోను మరింత స్పష్టంగా చూసే వీలు డిజిటల్ రూపంలో కలగనుంది. సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి.. తప్పుడుదారుల్లో ఓటరు కార్డు వినియోగించకుండా ఉండటానికి వీలుగా.. ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అయితే.. టెక్నాలజీతో తీసుకొచ్చే డిజిటల్ ఓటరు కార్డు దుర్వినియోగం కాకుండా చూసుకోవటం అసలైన సవాలుగా చెబుతున్నారు. దీంతో.. ఈ అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చు అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. పెరిగిన ధరలు.. ద్రవ్యోల్బణంతో పాటు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఖర్చుపై ఉన్న పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 2014లో చివరి సారిగా ఎన్నికల్లో ఖర్చు పరిమితిని పెంచారు. రానున్న అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఖర్చు పరిమితిని మరింత పెంచితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News