మోడీకి చంద్రబాబు అందుకే లెటర్ రాశాడా?

Update: 2020-08-20 06:45 GMT
తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి టీడీపీ అధినేత చంద్రబాబు అని చెబుతుంటారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన మీడియాతో పలు ప్రభుత్వాలను కూల్చేశాడంటారు. అసలు మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబును మించిన తోపు ఎవరూ లేరని చెబుతుంటారు. గోబెల్స్ ను మించి బాబు మీడియాతో రాజకీయాలను ఆట ఆడించేస్తుంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే ప్లాన్లు చేస్తున్నారట..

టాపిక్ ను డైవర్ట్ చేయడంలో.. మీడియాను తన వైపు తిప్పుకోవడంలో తోపు ఎవరైనా ఉన్నారా అంటే చంద్రబాబు తరువాతే అని చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఫ్రూఫ్ లేకుండా మోడీకి లెటర్ రాశాడు చంద్రబాబు అని తెలుగు మీడియా అనుకుంటే.. దాని వెనుక పెద్ద తతంగం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి..

మోడీకి రాసిన లేఖతో జాతీయ మీడియాలో  చంద్రబాబు గురించి వార్తలు వచ్చేటట్టు చూసుకొని జాతీయస్థాయిలో సీఎం జగన్ ను విలన్   చేయాలనే కుట్ర దీనివెనుక ఉందని ప్రచారం సాగుతోంది. నేషనల్ మీడియా కవర్ చేస్తే అన్ని జాతీయపార్టీలు చంద్రబాబుకు కాల్ చేస్తాయి. సానుభూతి కోసమే చంద్రబాబు ఈ ప్రయత్నం చేశాడని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

అలా ఆధారాలు లేకున్నా జగన్ ను అభాసుపాలు చేసే స్కెచ్ ను చంద్రబాబు తెలివిగా చేశారని.. ఇలాంటి విషయంలో చంద్రబాబును మించి జగజ్జంత్రీ మరొకరు లేరని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News