అచ్చెన్న విషయంలో బాబు వైఖరి నచ్చలేదా? గుసగుస!
కాళ్ల పారాణి కూడా ఆరకముందే.. పెళ్లి కూతురుకు కష్టాలు వచ్చిపడిన చందంగా ఉందట.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితి! కేంద్ర మాజీ మంత్రి, దివంగత కింజరాపు ఎర్రన్నాయు డు సోదరుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అచ్చెన్న.. తనకంటూ.. సొంత ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నా రు. గత చంద్రబాబు సర్కారులో మంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆయన దూకుడు రాజకీయాలకు.. దురుసైన విమర్శలకు కూడా కేంద్రంగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి అప్పట్లో చుక్కలు చూపించారు. ఇక, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనూ ఆయన అసెంబ్లీలో సర్కారును ఉక్కిరిబిక్కిరి గురిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు.. అచ్చెన్నాయుడికి.. శాసన సభ ఉప నేతగా అవకాశం కల్పించారు. ఇటీవల ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలను కూడా అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అచ్చెన్నకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయని అంటున్నారు పరిశీలకులు. పార్టీ పగ్గాలు ఇచ్చారే తప్ప.. కీలకమైన అధికారాల ను.. పర్యవేక్షణ బాధ్యతలను కూడా చంద్రబాబు తనవద్దే ఉంచుకున్నారనేది అచ్చెన్న వర్గం ప్రధాన ఆరోపణ. ఇటీవల రాష్ట్ర కమిటీని నియమించారు చంద్రబాబు. దీనికి సంబంధించి.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారని ఆయన వర్గం భావించింది.
కానీ, చంద్రబాబు ఏకపక్షంగా నియామకాలు చేపట్టారు. అయితే ఏంటి? ఇందులో తప్పేముంది? అంటారా? ఇక్కడే ఉంది.. విషయం అంటున్నారు అచ్చెన్న అనుచరులు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలపై గట్టి పట్టున్న అచ్చెన్నకు.. ఇప్పుడు జరిగిన నియామకాలపై తీవ్ర అసంతృప్తి ఉందట. తన టీం అంటే.. అవసరమైతే.. 24/7 పనిచేసేలా ఉండాలని ఆయన భావిస్తున్నారట. కానీ... చంద్రబాబు మాత్రం గుర్రు పెట్టి నిద్ర పోయేవారిని, వైసీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న వారిని కూడా నియమించడం.. అచ్చెన్నకు మింగుడు పడడం లేదని అంటున్నారు.
పోనీ.. వీరిని మారుద్దామా? అంటే.. నేరుగా చంద్రబాబు చేసిన నియామకాలు కావడంతో అచ్చెన్నకు చుక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరోవైపు.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ఇంకా ప్రమాణం చేయాల్సిఉంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని అనుకున్నా.. కరోనా నేపథ్యంలో వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు అచ్చెన్న అనుచరులు. ఈ పరిణామాలతో అచ్చెన్న బాధ్యతలు నిర్వహిస్తున్నా.. మనస్పూర్తిగా ఆనందించలేక పోతున్నారని వారు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య అచ్చెన్న పార్టీనిఎలా ముందుకు నడిపిస్తారో చూడాలని అంటున్నారు.