టీఆర్ఎస్ ఎంపీ లాబీయింగ్ తో స్వర్ణ ప్యాలెస్ ఇష్యూ సైడ్ అయ్యిందా?

Update: 2020-08-18 10:51 GMT
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో 10మంది అమాయకపు రోగులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వర్ణప్యాలెస్ లో ఆసుపత్రిని నిర్వహించిన రమేశ్ హాస్పిటల్స్ పై విమర్శలు వచ్చాయి. దీంతో ఏపీ సర్కార్ కూడా సీరియస్ గా ఈ కేసులో విచారణ జరిపింది. రమేశ్ హాస్పటిల్ ఎండీ, ఇతర బాధ్యులకు నోటీసులు పంపి విచారణ జరుపుతోంది. రమేశ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ముందస్తు  బెయిల్ కోసం హైకోర్టుకెక్కారు. విచారణ జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వం ఈ ప్రమాదానికి కారణమైన రమేశ్ హాస్పిటల్ మీద దృష్టిసారించింది. కానీ ప్రమాదం చోటుచేసుకున్న స్వర్ణ ప్యాలెస్ ను వదిలేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సడన్ గా ఈ స్వర్ణ ప్యాలెస్ ఇష్యూ సైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.  స్వర్ణ ప్యాలెస్ మీద పెద్దగా కేసులు కూడా లేవు అని అంటున్నారు.

ఈ మొత్తం కేసు నీరుగారిపోవడం వెనుక తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ లాబీయింగ్ పెద్ద ఎత్తున చేశాడని.. అందుకే స్వర్ణ ప్యాలెస్ మీద ఏపీ ప్రభుత్వం కాన్ సంట్రేషన్ తగ్గించిందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదురు ఎంపీ స్వర్ణ ప్యాలెస్ ఓనర్ కు వరసకు వియ్యంకుడు అవుతాడని.. అందుకే స్వర్ణ ప్యాలెస్ ను సైడ్ చేశారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  మరి ఈ జరుగుతున్న ప్రచారమంతా నిజమో కాదో అధికారులు చెప్పాలి మరీ..
Tags:    

Similar News