పెళ్లి కానీ అమ్మాయిలకి ఆ పరీక్షలా చేయచ్చా ... ఏ పరీక్షంటే ?
ఈ సమాజంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటల గురించి తెలుసుకున్న తరువాత మనం ఉండేది అసలు ఇటువంటి సమాజంలోనా అని అనిపించకమానదు. ఎందుకు అంటే జరిగే ఘటనలు ఆలా ఉన్నాయి. ఎంతమంది, ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, ఎప్పుడో పురాతన కాలంనాటి ఆచారాలని పాటిస్తూ.. వాటితో కొందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా మహాత్మాగాంధీ నడియాడిన గడ్డపై మహిళలకి మరో అవమానకరణీయమైన ఘటన ఒకటి జరిగింది.
రుతుస్రావంలో ఉన్న అమ్మాయిలను గుర్తించేందుకు ఈ మద్యే క్రితం ఓ కళాశాలలో అధ్యాపకుల విపరీత ధోరణులకు కారణమైన గుజరాత్‌లోనే మరోసారి మహిళలను అవమానించేలా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకొంది. ఫిజికల్ టెస్ట్ నిమిత్తం ట్రైనీ మహిళా క్లర్క్ లను నగ్నంగా నిలబెట్టడంతో పాటు పెళ్లి కాని అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు చేశారు. సూరత్ లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు.
ట్రైనీ సిబ్బంది మూడేళ్ల శిక్షణ కాలం పూర్తి చేసుకున్న తర్వాత,, తప్పని సరిగా ఫిజికల్ టెస్ట్ చేయించుకోవాలనేది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధన. శిక్షణ తర్వాత ఉద్యోగం చేసేందుకు ఫిజికల్‌గా ఫిట్ గా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ఈ నిబంధన తప్పని సరి చేశారు. ఈ నేపథ్యంలో పది మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్ష కోసం వాళ్లంతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సూరత్ మున్సిపల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రికి వెళ్లారు.
ఆ పది మందికి ఫిట్ నెస్ పరీక్ష ఓ పిటీ పరీక్షైంది. ఎందుకంటే తమను మహిళా వైద్యులు సామూహికం గా నగ్నంగా నిలబెట్టారని తెలిపారు . అంతేకాదు తమను ప్రిగ్నెన్సీకి సంబంధించి లేడీ డాక్టర్ ఇబ్బందికర ప్రశ్నలతో మానసిక వేదనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పెళ్లికాని వారికి ప్రిగ్నెన్సీ పరీక్షలు చేసి దారుణంగా అవమానించారని ట్రైనీ మహిళా క్లర్క్ లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిమిత్తం ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు.