మండ‌లి ర‌ద్దు.. తెలుగు దేశానికి ఎంత న‌ష్టం అంటే!

Update: 2020-01-27 05:27 GMT
మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం ప‌ట్ల తెలుగుదేశం పార్టీ చాలా బాధ‌ ప‌డుతూ ఉంద‌ని ఆ పార్టీ నేత‌ల మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్టం అవుతూ ఉంది. మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌క‌ముందే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఈ విష‌యం లో స్పందిస్తూ వ‌చ్చారు. మండ‌లి ర‌ద్దు ఎందుక‌ని వారు ప్ర‌శ్నించారు. ఆ నిర్ణ‌యాన్ని విమ‌ర్శించారు. అంతే కాదు.. కొన్నాళ్లు వెయిట్ చేస్తే మండ‌లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మెజారిటీ వ‌స్తుంది క‌దా.. అని కూడా వ్యాఖ్యానించారు. ఇలా మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం విష‌యంలో జ‌గ‌న్ వెనుక్కు త‌గ్గాల‌న్న‌ట్టుగా వారు అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు.

దీన్ని బ‌ట్టి మండ‌లి కొన‌సాగ‌డం పై తెలుగ‌దేశం పార్టీకి ఎంత ఆస‌క్తి ఉందో స్ప‌ష్టం అవుతూ వ‌చ్చింది. అధికారంలో లేక‌పోయినా మండ‌లిలో తెలుగుదేశం అధికారం చ‌లాయించ‌డం వ‌ల్ల‌నే ప‌రిస్థితి ఇంత వ‌ర‌కూ వ‌చ్చింద‌ని స్ప‌ష్టం అవుతూ వ‌చ్చింది. మండ‌లిలో ప్ర‌భుత్వ బిల్లుల‌ను అడ్డుకుంటూ..మళ్లీ మండ‌లి కొన‌సాగాల‌ని తెలుగుదేశం పార్టీ దురాశ‌ తో వ్య‌వ‌హ‌రించింది. అయితే ఈ విష‌యంలో ఏ మాత్ర స‌హించేది లేద‌న్న‌ట్టుగా జ‌గ‌న్ నిర్ణ‌యం తీసేసుకున్నారు.

దీని వ‌ల్ల జ‌గ‌న్ కు కూడా కొంత రాజ‌కీయంగా ఇబ్బంది త‌ప్ప‌దు. అయినా ఆయ‌న దాన్ని ఎదుర్కొన‌డానికి రెడీ అయ్యారు. మండ‌లి ర‌ద్దు చేసేస్తూ నిర్ణ‌యం తీసేసుకున్నారు. కేబినెట్ ఆమోద ముద్ర ప‌డింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం మింగుడు ప‌డే అంశంలా క‌నిపించ‌డం లేదు.

ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికే ఈ అంశంలో స్పందించారు. త్యాగాల‌కు సిద్ధం కావాల‌ని.. త‌మ వారిని సిద్ధం చేశారు. అయితే ప‌ద‌వుల‌ను కోల్పోవ‌డానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న వాళ్లు అస్స‌లు ఒప్పుకోక‌ పోవ‌చ్చు. కాబ‌ట్టి మండ‌లి లో త‌మ పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరే ఇంత వ‌ర‌కూ వ‌చ్చింద‌ని వారు బాధ‌ ప‌డుతూ ఉండ‌వ‌చ్చు. ఇక తాము అధికారం లోకి వ‌స్తే మండ‌లి మ‌ళ్లీ వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించేశార‌ట‌! ఈ మాట చాలు..మండ‌లి ర‌ద్దుపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత‌లా బాధ‌ ప‌డుతూ ఉందో అంచ‌నా వేయ‌డానికి!
Tags:    

Similar News