సుజనా మీద బీజేపీ హైకమాండ్ సీరియస్? షోకాజ్ నోటీస్?
హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో లాబీయింగ్ చేసిన బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహారం సెగలు రేపుతోంది. ఈ సెగలు ఇప్పుడు బీజేపీని తాకాయి. బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సుజనా, కామినేని తీరుపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం దీనిపై పార్టీ ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ ను వివరణ కోరినట్లు తెలిసింది. ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీపై పార్టీ పరువును తీశారని హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర బీజేపీలోని కొందరు టీడీపీ వ్యతిరేక నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరణ కూడా కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వైసీపీతో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని బీజేపీ అధిష్టానం నేతలను కట్టడి చేయాలన్న నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు.
బీజేపీ అధిష్టానం సీరియస్ కావడంతో సుజనా చౌదరితోపాటు కామినేనికి షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నట్టు తెలిసింది. వారి వివరణ విన్నాక వారిని పార్టీలో ఉంచాలో సాగనంపాలో బీజేపీ అధిష్టానం తేల్చేయబోతోందని బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.