గేల్ ను మర్చిపోయేలా చేశాడు

Update: 2016-04-29 09:11 GMT
    క్రికెట్ లో హార్డు హిట్టర్లకు చిరునామా అయిన వెస్టిండీస్ నుంచి గతంలో రిచర్డ్సు... ప్రస్తుతం గేల్, పొలార్డు వంటివారు తమ వీర ఉతుకుడుతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ నుంచి మరో వీర హిట్టర్ రెడీ అవుతున్నాడు. గేల్ రికార్డును తిరగరాసి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

మూడేళ్ల కిందట ఐపీఎల్ లో 30 బంతుల్లో సెంచరీ చేసి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన గేల్ రికార్డును ట్రినిడాడ్ టొబాగోకు చెందిన  23 ఏళ్ల ఇరాక్ థామస్ బ్రేక్ చేశాడు. కేవలం 21 బంతుల్లో సెంచరీ బాదేసి ఔరా అనిపించాడు.  శుక్రవారం స్క్రాబోరా, స్పైసైడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో స్క్రాబోరా తరఫున బరిలో దిగిన ఇరాక్ కేవలం 21 బంతుల్లో చుక్కలు చూపించేశాడు. 15 సిక్సర్లు - 5 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇరాక్ దూకుడు కారణంగా ఆయన జట్టు కేవలం 8 ఓవర్లలోనే 152 పరుగుల లక్ష్యాన్ని చేధించేసింది.

ఇరాక్ మొత్తం 31 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే చితకబాదిన థామస్ మొత్తం  15 సిక్సర్లు - 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

Tags:    

Similar News