వేసవిలో ఇంత వేడా? వందేళ్ల రికార్డు బ్రేక్?

ఈ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి. గత వందేళ్లలో లేని రికార్డు బ్రేక్ చేస్తున్నాయి.

Update: 2024-05-01 06:07 GMT

ఈ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి. గత వందేళ్లలో లేని రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

తెలంగాణ, సిక్కిం, కర్ణాటక రాష్ట్రాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయిలో ఎండలు ముదరడం కంగారు పెడుతోంది. 103 ఏళ్ల తరువాత ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఎండల తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతోంది. వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం 1921 తరువాత 2024కు ముందు ఏ ఏడాదిలోనూ 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం విశేషం. రానున్ ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడిగా మారుతుంది. దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయి. మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా వాతావరణ శాఖ చెప్పిన సూచనల ప్రకారం నడుచుకోవడం మంచిది.

పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే భూతాపం పెరుగుతోంది. మంచుకొండలు కరుగుతున్నాయి. హిమనీనదాలు కనుమరుగవుతున్నాయి. దీంతో భూతాపం అధికమవుతోంది. దీని వల్ల భవిష్యత్ లో మరింత ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే వీలుంది.

ఈనేపథ్యంలో ఈ సంవత్సరం ఎండల వల్ల జనం బయటకు రాకుండా ఉండటమే మేలు. ఒకవేళ రావాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలి. నీళ్ల సీసా వెంట ఉంచుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. నెత్తిమీద టోపీ ధరించి ముఖంపై తెల్లని గుడ్డ కప్పుకోవాలి. ఎండ మీద పడకుండా అప్రమత్తంగా ఉంటేనే మంచిది. లేదంటే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News