బ్రేకింగ్ : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దు !

Update: 2021-06-09 05:10 GMT
తెలంగాణ ప్రభుత్వం నేడు  మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్‌ సెకండియర్‌ కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసిన సమయంలో కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని జూన్ మాసంలో సమీక్ష చేసి నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే సీబీఎస్ ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది.  ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ లో నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అని ప్రకటించారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. .
Tags:    

Similar News