ఐర్లాండ్‌ లో క‌ల‌క‌లం..సెల్ఫీ దిగుతూ మ‌నోడు మృతి

Update: 2019-01-05 16:07 GMT
యూరోపియ‌న్ దేశ‌మైన ఐర్లాండ్‌ లో విషాదం చోటుచేసుకుంది. భారతదేశానికి చెందిన ఓ విద్యార్థి ఐర్లాండ్‌ లో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన కంట్రీ క్లేర్‌ లోని మొహెర్ కొండ మీద చోటు చేసుకుంది. యువకుడు ఎవరనేది గుర్తుపట్టనప్పటికీ.. ఆ యువకుడు డబ్లిన్‌ లోని యూనివర్సిటీలో చదువుతున్నట్టు.. అతడి వయసు 20 ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు.

మొహెర్ కొండ ప్ర‌ముఖ‌ టూరిస్ట్ స్పాట్. చాలా మంది అక్కడికి వెళ్లి ఫోటోలు తీసుకుంటారు. అక్కడ కాసేపు గడుపుతారు. అలాగే భారత్‌ కు చెందిన ఓ యువకుడు కొండ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ తీసుకోబోయి కాలు జారి.. కింద ఉన్న సముద్రంలో పడి చనిపోయాడు. ఆ యువకుడు కింద పడిపోవడానికి గమనించిన స్థానికులు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్‌ కు సమాచారం అందించారు. వెంటనే హెలికాప్టర్ ద్వారా అతడి కోసం గాలించారు. హెలికాప్టర్ నుంచి అతడిని గుర్తించిన రెస్క్యూ టీం అతడిని పైకి లాగి.. వెంటనే డూలిన్‌ లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. భారత్‌ లోని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. 2007లోనూ ఓ హంగేరియన్.. అదే కొండ మీద ఫోటోలు తీసుకుంటూ జారి కింద పడి మృతి చెందాడు.




Full View
Tags:    

Similar News