బుద్ధి మార్చుకోని చైనా.. భారత్​ పైకి వరుణాస్త్రం.. సక్సెస్​ అయితే మనకి డేంజరే..!

Update: 2020-12-07 09:30 GMT
చైనా ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. పొరుగు దేశాలతో కయ్యాలు పెట్టుకోవడం.. వాటిని ఆర్థికంగా దెబ్బతీసి తమ దారిలోకి తెచ్చుకోవడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది జిత్తులమారి చైనా. వాతావరణాన్ని శాసించాలని చూస్తుంది. తద్వారా పొరుగుదేశాలకు అతివృష్టి, అనావృష్టి కల్పించాలని కుట్రలు చేస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే పరిశోధనలు సాగిస్తున్నది. అయితే చైనా.. భారత్​ను ప్రధానపోటీదారిగా భావిస్తున్నది. ఎప్పటికైనా భారత్​ తనకు పోటీదారు కాబోతున్నది అని చైనా అంచనావేస్తున్నది. అందుకే వ్యవసాయాధిరత దేశమైన ఇండియాను ఎదోరకంగా దెబ్బతీయాలని కుతంత్రాలు రచిస్తున్నది.  ఇందులో భాగంగా పొరుగుదేశాలపై ‘వరుణాస్త్రం’ ప్రయోగించాలని చూస్తున్నది.

 అయితే వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చైనా ప్రయోగాలు చేస్తున్నది. దీన్ని వెదర్​ మాడిఫికేషన్​ అంటారు. ఇందుకోసం వాతావరణాన్ని తనకు ఇష్టమున్నట్టు మార్చుకోవాలని చూస్తున్నది. చైనా చేస్తున్న ఈ ప్రయోగాలతో మానవాళికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ డ్రాగన్​ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్లౌడ్​సీడింగ్​ అంటే మేఘమథనం ద్వారా కావల్సినప్పుడు వర్షాలు పడేటట్టు చేయడం.. లేదా భారీ వర్షాలు పడకుండా కృత్రిమ పద్ధతుల ద్వారా నిలువరించడం ఈ ప్రయోగాల లక్ష్యం. ఇందుకోసం మేఘాల్లోకి సిల్వర్​ అయోడైడ్​ను పంపిస్తారు. ఇలా చేస్తే ఆయా ప్రాంతాల్లో వర్షాలు, లేదా మంచు కరుస్తుంది. ఇందే కాక క్యుములోనింబస్​ మేఘాలను కరగదీసి వడగండ్లు పడకుండా కూడా చేస్తారు. ఇందుకోసం కొన్ని ప్రయోగాలు చేయగా సత్ఫలితాలు ఇచ్చాయని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వడగండ్లు పడకుండా ఆపగలిగామని సైంటిస్టులు అంటున్నారు. అయితే కేవలం తమ దేశంలో అతివృష్టి లేదా అనావృష్టిని నివారించేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నామని చైనా చెబుతుంది. అయితే చైనా ఈ ప్రయోగాలను శత్రుదేశాలమీదకు ప్రయోగించక మానదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2025 నాటికి ఈ ప్రయోగాలు సక్సెస్​ అయ్యే అవకాశం ఉన్నది. చైనా వెదర్‌ మాడిఫికేషన్‌ ప్రయోగాలతో భారత్‌ కు ముప్పు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్​, చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ఈ వెదర్​ మాడిఫికేషన్​ ఇబ్బందులు కలగొచ్చన్న నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News