దారుణం.. పాకిస్తాన్ కన్నా దిగజారిన భారత్

Update: 2019-10-16 17:30 GMT
ప్రపంచంలోనే ఉగ్రవాదంతో సతమతమవుతూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విదేశాల వద్ద అప్పుల కోసం చేయిచాస్తున్న పాకిస్తాన్ మనకంటే ఆ విషయంలో మెరుగ్గా ఉండడం భారత్ కు అవమానంగా మారింది. తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రూపొందించిన పేదరిక నిర్మూలన సూచీలో భారత్.. తన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ కంటే వెనుకబడడం విస్తుగొలుపుతోంది.

మొత్తం 117 దేశాల్లో నిర్వహించిన సర్వేను విశ్లేషించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంస్థ భారత్ పేదరిక నిర్మూలనలో విఫలమైందని తేల్చింది. 2015లో 93వ స్థానంలో ఉన్న భారత్ 2019 కి వచ్చేసరికి 102 వ స్థానానికి దిగజారడం ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాసియా దేశాల్లో భారత్ మినహా మిగిలిన దేశాలు 66 నుంచి 94 వ ర్యాంకులు సాధించి భారత్ కంటే ముందున్నాయి.

ఇక బ్రిక్స్ దేశాల కన్నా దయనీయ పేదరికం భారత్ లో ఉందని సంస్థసర్వే నిగ్గుతేల్చింది. బ్రిక్స్ దేశాల్లో మనకంటే మెరుగ్గా దక్షిణాఫ్రికా 59వ స్థానంలో నిలిచింది. ఎప్పుడూ మనకంటే వెనుకబడి ఉండే పాకిస్తాన్ కూడా తాజాగా భారత్ కంటే కొంచెం మెరుగ్గా 94వ స్థానంలో నిలవడం విశేషం. ఇక పక్కనున్న బంగ్లాదేశ్ 88వ ర్యాంకుతో ఉంది.
Tags:    

Similar News