‘వ్యాక్సిన్ పాస్ పోర్టు’కు భారత్ వ్య‌తిరేకం.. కారణం ఇదే!

Update: 2021-06-06 01:30 GMT
క‌రోనా మొద‌టి వేవ్ అమెరికాను కుదిపేసింది. సెకండ్ వేవ్ భార‌త్ మీదుగా వెళ్లిపోయింది. ఇక‌, థ‌ర్డ్ వేవ్ అంటూ హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల‌న్నీ అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. త‌మ త‌మ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తెర‌పైకి వ‌చ్చిన ప్ర‌ధాన అంశం ‘వ్యాక్సిన్ పాస్ పోర్టు’. ప‌లు దేశాలు ఈ విధానాన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నాయి కూడా. అయితే.. ఈ విధానాన్ని భార‌త్ వ్య‌తిరేకిస్తోంది.

త్వ‌ర‌లో జీ-7 దేశాల శిఖ‌రాగ్ర‌ స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఆయా దేశాల ఆరోగ్య‌శాఖ మంత్రులు వ‌ర్చువ‌ల్ గా భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న ఆరోగ్య మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పాస్ పోర్టును భార‌త్ వ్య‌తిరేకిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో.. ఈ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే ఏంట‌నే ప్ర‌శ్న‌కు సింపుల్ గా ఆన్స‌ర్‌ చెప్పాలంటే.. పాస్ పోర్టు ఉంటేనే విమానం ఎక్క‌డానికి అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా.. వ్యాక్సిన్ పాస్ పోర్టు ఉంటేనే వెళ్లాల‌నుకున్న దేశానికి వెళ్ల‌గ‌ల‌రు. ఈ పాస్ పోర్టు ఎప్పుడు వ‌స్తుంది అన్న‌ప్పుడు.. వ్యాక్సిన్ వేసుకున్న‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తుంది. అంటే.. ఫైన‌ల్ గా వ్యాక్సిన్ తీసుకున్న‌వారు మాత్ర‌మే విమాన ప్రయాణం చేయ‌గ‌ల‌ర‌ని అర్థం. అలాంటి వారే ఇత‌ర దేశాల్లో అడుగు పెట్ట‌గ‌ల‌ర‌ని అర్థం.

అయితే.. దీన్ని భార‌త్ వ్య‌తిరేకిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా.. మిగిలిన దేశాల్లో వ్యాక్సినేష‌న్ కాలేద‌ని, అందువ‌ల్ల వ్యాక్సిన్ పాస్ పోర్టు అమ‌లు చేయ‌డం స‌రికాద‌ని వాదిస్తోంది. ఇలా చేయ‌డం వివ‌క్షేన‌ని అంటోంది. వ్యాక్సినేష‌న్ త‌క్కువ‌గా ఉన్న దేశాల స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించాల్సి ఉంద‌ని చెబుతోంది. మ‌రి, ఈ నిర్ణ‌యంపై జీ-7 భేటీలో ఎలాంటి చ‌ర్చ జ‌రుగుతుందో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News