దేశంలోనే తొలిసారి..మహిళాఎస్ ఐగా హిజ్రా
తరచూ ఏదో ఒక విషయానికి తమిళనాడు రాష్ట్రం వార్తల్లోకి ఎక్కుతోంది. అయితే.. ఇలా వార్తల్లో నానుతున్న ప్రతిసారీ ఏదో ఒకవివాదాస్పద అంశమే తెర మీదకు వస్తోంది. అందుకు భిన్నంగా ఈసారి.. సరికొత్త విధానానికి నాంది పలుకుతూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం.. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా సరికొత్త సంచలనంగా మారనుంది.
సమాజం చిన్నచూపు చూసే హిజ్రాలు..కొన్నింటికి మాత్రమే పరిమితమన్న భావన ఉంది.వారిని చూసిన వెంటనే వారిపై చిన్నచూపు చూసేలా ఉండటం మామూలే. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా ఎస్ ఐగా ఒక హిజ్రాను ఎంపిక చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడులోని సేలంజిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికకావటమే కాదు.. త్వరలో సబ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తాజాగా ధర్మపురి టౌన్ లో ఆమెకు పోస్టింగ్ ఖారారు చేస్తూ.. సీనియర్ అధికారులు ఆమెకు ఉత్తర్వులు జారీ చేశారు. లైఫ్ లో అనేక ఒడిదిడుకుల్నిఎదుర్కొని..ధైర్యంగా నిలిచి తోటి హిజ్రాలకు ఆదర్శంగా నిలిచిన ప్రీతికా ఎస్ ఐ ఉద్యోగం కోసం చాలానే న్యాయ పోరాటం చేశారు.
ఎట్టకేలకు ఆమెతన కలల జీవితాన్ని సాధించుకోగలిగారు. తానుఅనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వేళ..రితికా మాట్లాడుతూ..తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తానని చెప్పారు. పోస్టింగ్ లోనే సంచలనం సృష్టించిన ఆమె విధి నిర్వహణలో మరెన్నిసంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/