భారత్ కావాలి.. చైనా కావాలి: అమెరికా ద్వంద్వ రాజకీయం

Update: 2020-07-17 04:15 GMT
అగ్రరాజ్యం అమెరికా భారత్-చైనా మధ్య నెలకొన్న వాతావరణంపై ఓ కన్ను ఉంచింది. తరచూ ఈ అంశంపై అమెరికా స్పందిస్యోంది. తాజాగా ఈ అంశంలో ద్వంద్వ రొజకీయం చేస్తోందో. భారతదేశాన్ని ప్రేమిస్తున్నామంటూనే చైనాను కూడా ప్రేమిస్తున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడానికి తాము ముందుంటామని మరోసారి స్పష్టం చేసింది. ఇదివరకే పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించిన అమెరికా మరోసారి ఆ ప్రస్తావనను తెరమీదికి తీసుకొచ్చింది. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం సరికాదని ఈ సందర్భంగా పేర్కొంది.

రెండు దేశాల ప్రజలను తాము ప్రేమిస్తున్నామని, వారి మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి సాధ్యమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ విషయమై వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కెయిలీ మెక్ఎనానీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్-చైనా మధ్య సఖ్యత నెలకొనాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి తాము ముందుంటామని వైట్‌హౌస్ ఆర్థిక సలహదారు ల్యారీ కుడ్లోవ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయమేంటనేది ప్రెస్ కార్యదర్శి స్పష్టం చేశారు. టిక్‌టాక్ సహా చైనా రూపొందించిన యాప్స్‌ను నిషేధించాలంటూ యూఎస్ కాంగ్రెస్ సభ్యులు లేఖ రాసిన రోజే డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి తాజాగా ప్రకటన వెలువడటం ఆసక్తి రేపుతోంది. భారత్‌ సహా ఏ దేశాన్ని కూడా వదులుకోవడానికి లేదా వివాదాలు, ఘర్షణ వాతావరణాన్ని కొని తెచ్చుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేసినట్టయింది.
Tags:    

Similar News