పాక్ స్పై ను అరెస్ట్ చేసిన భారత్ .. ఎక్కడంటే?

Update: 2020-10-25 02:30 GMT
భారత్ లో ఉంటూ పాకిస్థాన్ ‌కోసం  పనిచేస్తున్న ఓ వ్యకిని భారత్ పట్టుకుంది. అతడు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ ‌కు పనిచేస్తున్నాడని సమాచారం. ఆ వ్యక్తిని రాజస్తాన్‌లోని బార్మర్ ప్రాంతంలో పట్టుకున్నట్టు రాజస్తాన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా వెల్లడించారు. ప్రస్తుతం అతడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. అలాగే ,  ఇప్పటి వరకూ అంత విలువైన సమాచారం ఏమి అతడు చెప్పలేదని, ఇంకా విచారణ కొనసాగిస్తామని చెప్పారు.

అయితే అతడి పేరు రోషన్‌దిన్ అని కొందరు చెప్తున్నారు. అతడిని విచారణా నిమిత్తం జైపూర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రోషన్ ‌దిన్ ‌ను పట్టుకోవడంలో విజయం సాధించింది. అతడు ప్రస్తుతం పాకిస్తాన్ మిషన్‌ లో ఉన్నాడని, దాని కొసమే బార్మర్ వచ్చినట్లు చెప్పారు. భారత ఆర్మీ, సరిహద్దుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకే పాకిస్తాన్ అతడిని ఎంచుకుందని చెప్పారు. అంతేకాకుండా ఆర్మీ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్  వివరాలను వారికి అందించేందుకు ప్రయత్నించాడని తెలిపారు.
Tags:    

Similar News