• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విదేశాల్లో దాచిన బ్లాక్...

విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ అంతేనట

By - Tupaki Desk
Update: 2017-02-08 09:16 GMT
వేలాది కోట్ల బ్లాక్ మనీ విదేశాల్లో మూలుగుతుందంటూ చెప్పే కథనాలకు క్లారిటీ ఇచ్చేశారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. హెచ్ఎస్ బీసీ.. ఐసీఐజేలు ఇచ్చిన జాబితాల మీద విచారణ జరిపిన అనంతరం.. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం రూ.16.2వేల కోట్లుగా తేల్చారు. హెచ్ ఎస్ బీసీ బ్యాంకు విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8200 కోట్ల నగదును గడిచిన రెండేళ్లలో పన్ను పరిధిలోకి తెచ్చినట్లుగా చెప్పిన ఆయన.. మరో  రూ.8వేల కోట్లను రుణంగా తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు.

విదేశాల్లో భారతీయులు దాచిన నగదు లెక్కపై సరైన లెక్కలులేవని చెప్పిన ఆయన.. పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్తగా వినియోగంలోకి తీసుకొచ్చిన నోట్ల లెక్కల్ని వెల్లడించారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ నవంబరు 8 - 2016లో ప్రధాని నిర్ణయం వెల్లడించిన రెండు రోజుల తర్వాత నవంబరు 10 నుంచి జనవరి 13 మధ్య కాలంలో మొత్తంగా రూ.6.78 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రూ.9.1లక్షల కోట్ల నోట్లు చెలామణిలో ఉన్నట్లుగా చెప్పినఆయన.. రద్దు చేసిన పెద్దనోట్లు (వెయ్యి.. రూ.500) మొత్తంగా రూ.12.44లక్షల కోట్లుగా చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా.. ఖాతాల్లో జమ చేయటం ద్వారా.. నకిలీలను అరికట్టామని.. దీంతో గడిచిన రెండేళ్లలో రూ.21వేల కోట్ల సబ్సిడీ మొత్తాన్ని మిగిల్చినట్లుగా వెల్లడించారు. మరిన్ని వేల కోట్లను పక్కదారి పట్టకుండా ఆపినప్పుడు.. ఆ మొత్తాన్ని వేటికి వినియోగించారన్న విషయంపై మరింత క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Income tax 
  • Black money 
  • Arun Jaitley 

Similar News

మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌

2026-11-21 17:41 GMT

3 గంట‌ల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్ర‌బాబు

2026-11-21 17:39 GMT

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?

2026-11-21 17:04 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS