సీఎం రావత్ కు అస్వస్థత - ఎయిమ్స్ కు తరలింపు
కరోనా మహమ్మారి తో బాధ పడుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీనితో ఆయనను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. రావత్ కు ఛాతీలో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు ఎయిమ్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు.
సీఎం రావత్ ఈ నెల 18వ తేదీన ఆయనకు కరోనా వైరస్ భారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. వారందరూ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. అక్కడే వైద్య చికిత్స తీసుకుంటున్నప్పటికీ, రావత్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. మరింత విషమించింది. దీనితో ఆయనను రాత్రికి రాత్రి డూన్ ఆసుపత్రిలో చేర్చారు. వీఐపీ వార్డులో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రాత్రంతా ఆయనకు అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ, ఫలితం కనిపించలేదు. ఆరోగ్యం మరింత విషమించింది.
కానీ నిన్నటి నుండి ఆయనకు జ్వరంగా ఉండటంతో నిన్న సాయంత్రం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు చాతిలో ఇన్ఫెక్షన్ ఉండడంతో అక్కడ వైద్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. దీంతో ఆయన అక్కడి నుండి స్పెషల్ చాపర్ లో ఢిల్లీ వచ్చి ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు.