ఇది బంగారు జిల్లాయేనా ?
రాయలసీమలోని అనంతపురం జిల్లాలోని పదిచోట్ల బంగారు నిక్షేపాలున్నట్లు భూగర్భ గనులశాఖ గుర్తించింది. గనులశాఖ పరిధిలోని ఖనిజాన్వేషణ విభాగం ఉన్నతాధికారులు జరిపిన అన్వేషణలో ఈ విషయం బయటపడింది. జిల్లా మొత్తం మీద సుమారు 16 టన్నుల బంగారు నిక్షేపాలున్నట్లు ఉన్నతాధికారుల అన్వేషణలో బయటపడింది. వీటికి తవ్వి బయటకు తీయటానికి కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర గనులశాఖ సంప్రదింపులు జరుపుతోంది.
అనంతపురం జిల్లాలోని మండల కేంద్రమైన రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) ఆధ్వర్యంలో బంగారు ఖనిజాలను బయటకు తీయటానికి తవ్వకాలు జరిగాయి. సంవత్సరాలపాటు జరిగిన తవ్వకాల్లో టన్నుల కొద్దీ బంగారాన్ని తీశారు. ఆ తర్వాత బయటకు తీసే బంగారం కన్నా దానికయ్యే ఖర్చే చాలా ఎక్కువగా ఉందన్న లెక్కల కారణంగా తవ్వకాలను నిలిపేశారు. టన్ను మట్టిని బయటకు తీస్తే అందులోనుండి 4 గ్రాముల బంగారం మాత్రమే బయటపడుతుంది.
తాజాగా అన్వేషణలో బీజీఎంఎల్ తవ్వకాలు నిలిపేసిన గనులకు దగ్గరలోనే కొత్తగా 2 గనులను నిపుణులు కనుక్కున్నారు. అలాగే రొడ్డం మండలంలోని బొక్కంపల్లిలో రెడు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరుచోట్ల బంగారు నిక్షేపాలున్నట్లు నిపుణులు ప్రాధమికంగా గుర్తించారు. పై మండలాల్లో గనులున్న ప్రాంతాలను లెక్కగడితే 97.4 చదరపు కిలోమీటర్ల పరధిలో బంగారు నిక్షేపాలున్నట్లు తేలింది.
పై గనుల్లో మినిమం 50 మీటర్ల లోతులోకి తవ్వితే కానీ బంగారు ఖనిజాలు దొరకవు. జౌకులలోని 6 ప్రాంతాల్లో అత్యధికంగా 10 టన్నులు, రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నుల బంగారం నిక్షేపాలున్నాయని నిపుణులు అంచనాలు వేశారు. ఈ ప్రాంతాల్లోని నిక్షేపాల లభ్యతను గమనిస్తే ఎక్కువ లోతులోకి వెళ్ళకుండానే బంగారం దొరుకుతుందని అంచనా వేశారు. మార్కెట్ ధరలను బట్టి చూస్తే తవ్వకాల ద్వరా వస్తుందని అనుకుంటున్న బంగారం మంచి గిట్టుబాటు అవుతుందని కూడా నిపుణులు లెక్కకట్టారు.
రాష్ట్రంలో తొమ్మిది ప్రాంతాల్లో బేస్ మెటల్, కాపర్, మాంగనీస్, గోల్డ్, వజ్రాలు, ఇనుపఖనిజాలు అందుబాటులో ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. గతంలోనే పశ్చిమగోదావరి-కృష్ణా జిల్లా సరిహద్దుల మధ్య అపారమైన బొగ్గు నిక్షేపాలున్నట్లు నిపుణులు గుర్తించిన విషయం తెలిసిందే. పై ఖనిజాలకు సంబంధించిన అన్వేషణ వివరాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్రప్రభుత్వానికి అప్పగించింది. మరి వీటి తవ్వకాలకు కాంపోజిట్ లైసెన్సులను ఇవ్వాలని కూడా రాష్ట్రం డిసైడ్ చేసింది. ఒక్కో వ్యక్తి లేదా సంస్ధకు వెయ్యి హెక్టార్లవరకు తవ్వకాలకు లైసెన్సులు ఇవ్వబోతున్నారు. ఏదేమైనా కరువు జిల్లాగా ముద్రపడిన అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలున్నాయని మళ్ళీ బయటపడటం సంతోషించదగ్గ విషయమే.