మోడీ చాయ్ వాలా కాదు. అస్సాం చాయ్ వాలా
ఇంతకాలం తనను తాను చాయ్ వాలాగా చెప్పుకొని మార్కులు కొట్టేసిన ప్రధాని మోడీ మరో అడుగు ముందుకేశారు. అస్సాం ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ చాయ్ ను మరోసారి తనకు అనుకూలంగా మలచుకున్నారు. చాయ్ అంటేనే అస్సాం పేరు గుర్తొస్తుంది. మోడీ కూడా సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్నారు. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పిన మోడీ తాను చిన్నతనంలో అస్సాం టీనే విక్రయించేవాడినని చెప్పుకొచ్చారు. తీన్ సుకియాలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ అస్సాం టీ తాగిన వెంటనే ఎంతో ఉత్తేజం వస్తుందని చెప్పారు.
అస్సాంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా నీటికి కటకటగానే ఉండటం బాధాకరమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. స్వాతంత్య్ర సమర సమయంలో ఎంతో అభివృద్ధిపథంలో ఉన్న అస్సాం నేడు ఎంతో పేదరికాన్ని ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌తో తనకేమీ పేచీ లేదని, తన పోరాటం కేవలం పేదరికం, అవినీతి మీదేనని మోడీ వివరించారు.
మొత్తానికి బీజేపీకి అంతగా పట్టులేని ఈశాన్య రాష్ట్రంలో మోడీ వేసిన అస్సాం టీ మంత్రం ఎలా పనిచేస్తుందో చూడాలి. అస్సాం టీ ఉత్తేజానికి చిహ్నమన్న ఆయన భాజపాను ఉత్తేజపరచడంలో అస్సాం టీం ఎంతగా ఉపయోగిస్తారో చూడాలి.