హైదరాబాద్ కు ఆ స్పెషాలిటీ ఇక లేనట్లే
రాష్ట్ర విభజన సందర్భంగా రాజధానుల గురించి భారీగానే చర్చ సాగింది. మరి.. ముఖ్యంగా సీమాంధ్రులు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. హైదరాబాద్ లేని కారణంగా జరిగే నష్టం భారీగా ఉంటుందని ఒక వర్గం వాదిస్తే.. కష్టపడే తత్వం ఉన్న సీమాంధ్రులు తమదైన రాజధానిని తయారు చేసుకుంటారన్న ఆశావాహ దృక్ఫధాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వాదనల నేపథ్యంలో ఒక్క విషయంలో ఆశావాహ మాటలు చెప్పే వారు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంతకీ ఆ మాట ఏమిటంటే.. ఏపీ రాజధానిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చేమో కానీ.. హైదరాబాద్ వాతావరణాన్ని ఎలా తీసుకురాగలరన్న మాటకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి.
గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం.. సమశీతోష్ణ స్థితి కారణంగా ఎంత ఎండ కాసినా చెమట పట్టకపోవటం.. ఏడాదిలో వీలైనంత ఎక్కువ కాలం చల్లదనం ఉండటం లాంటి వాతావరణం కోస్తాలో ఆశించలేమని.. అక్కడి ఉక్కపోత.. చెమటలతో చచ్చిపోవటం ఖాయమన్న మాట వినిపించేది. అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా వాతావరణం విషయంలో హైదరాబాద్ తో పోటీ పడలేదన్న మాట వినిపించేది.
వాతావరణం విషయంలోనూ హైదరాబాద్ కున్న ప్రత్యేకత గతమన్న విషయం .. గడిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. గతంలో మాదిరి పొడి వాతావరణం లేకపోవటం.. హైదరాబాద్ లో పెరిగిన కాలుష్యంతో ఇక్కడి విలక్షణ వాతావరణం మాయం కావటమే కాదు.. కోస్తాలో మాదిరి (కోస్తా అంత కాకున్నా) చెమటలు.. ఉక్కపోత షురూ కావటం హైదరాబాదీయుల్ని కుంగదీస్తోంది. పెరిగిన కాలుష్యం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అధికారుల ముందుచూపు లేమి మొత్తం కలిపి హైదరాబాద్ లో మాత్రమే కనిపిస్తుందన్న విలక్షణ వాతావరణం మాయమైనట్లే. సో.. ఏపీ రాజధాని అమరావతికి.. హైదరాబాద్ కి ఉక్కపోతలో.. వేడి తీవ్రతలో పెద్ద తేడా లేనట్లే.