అత్త.. అల్లుడి సంబంధం.. అమ్మాయి ఆత్మహత్య
మానవ సంబంధాలు అంతకంతకూ బలహీనమైపోతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పాళ్లు ఆందోళనకర స్థాయిలోకి వెళ్లిపోతున్నాయి. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థంకానట్లుగా కొన్ని ఉదంతాలు బయటకు వచ్చి.. చాలామందిలో కొత్త భయాల్ని.. అనుమానాల్ని పెంచుతున్నాయి. తాజా ఉదంతం చూస్తే.. మరీ ఇంత మోసమా? అన్న భావన కలుగక మానదు. ఈ వ్యవహారంలో మోసం చేసినోళ్లు బాగానే ఉంటే.. బాధితురాలు మాత్రం తనువు చాలించటం గమనార్హం.
నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగిన ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న వైనం హైదరాబాద్ శివారులోని మీర్ పేటలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో తన తల్లి.. భర్త మధ్య ఉన్న అపవిత్రమైన సంబంధాన్ని ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం చూస్తే.. అయ్యో పాపం అనిపించటమే కాదు.. ఇంత మోసం చేయటమా? అనిపించక మానదు.
మీర్ పేటలోని అల్మాస్ గూడకు చెందిన అనిత భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు నవీన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయమైంది. అది కాస్తా మరో దిశకు తీసుకెళ్లింది. తమ మధ్యనున్న సంబంధం శాశ్వితంగా ఉండాలని భావించిన అనిత.. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే తన కుమార్తె వందన (19)ను నవీన్ కుమార్ కు ఇచ్చి గత డిసెంబరు ఒకటిన పెళ్లి చేశారు.
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నవీన్.. అనితల మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఇది గమనించిన వందన.. తాము విడిగా ఉండాలని భర్తకు చెప్పింది. వారు విడిగా ఉంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని తల్లి బెదిరింపులకు దిగింది. దీంతో.. తల్లి.. భర్త చేసిన మోసాన్ని జీర్ణించుకోలేని వందన సూసైడ్ నోట్ రాసి చీరతో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకొని భార్యను మోసం చేసి.. ఈ రోజు కేసులో ఇరుక్కునే కంటే.. తామిద్దరే పెళ్లి చేసుకుంటే అసలు ఇష్యూనే ఉండన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో?