భార్యను చంపిన భర్తకు ఉరి శిక్ష !

Update: 2021-04-08 09:33 GMT
భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష విధిస్తూ మహిళా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పును విధించింది. కృష్ణలంక లో 2019లో గర్భవతి అయిన భార్యపై  భర్త పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. అత్యంత  దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనను సీరియస్‌ గా తీసుకున్న కోర్టు భర్త బత్తుల సంబియార్ సుజిత్‌ కు ఉరిశిక్షను విధించింది. కోర్టు ఈ తీర్పును ప్రకటించిన నేపథ్యంలో బాధితురాలి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. 2019 జూన్ 15న ఏపీ రాష్ట్రంలోని ఫకీర్‌గూడెంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.నిందితుడు  సుజిత్ తన భార్యను చంపినట్టుగా కోర్టుకు ఆధారాలను పోలీసులు సమర్పించడంతో  అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో  సుజిత్ కు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసుల్లో గతంలో కూడ కోర్టులు మరణశిక్షలు విధించాయి. అయితే మరణశిక్షలు విధించడం చాలా అరుదుగా జరుగుతుందని న్యాయ నిపుణుులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News