పెళ్ళికూతురికి పాజిటివ్ .. పెళ్లి కొడుకు ఏంచేసాడంటే ?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో ..ఇంకా లాక్ డౌన్ నిబంధనలు ప్రభుత్వం అమలు చేస్తుంది. పూర్తి స్థాయి లాక్ డౌన్ ను కొనసాగితే ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయని భావించి లాక్ డౌన్ నుండి కొన్నింటికి సడలింపులు ఇచ్చారు. అయితే , దేశంలో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో , వివాహాలకు కేవలం 50 మంది , మరణాలకు 20 మంది లోపు మాత్రమే హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నియమాలని పక్కన పెట్టి కొంతమంది ఇష్టాను సారంగా ఎక్కువమందితో పెళ్లిళ్లు చేసుకొని కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఇలాగే ప్రభుత్వ నియమాలు పాటించకుండా వివాహ వేడుక నిర్వహించి 7 మందికి కరోనా సోకడానికి కారణమైయ్యారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే..పెళ్ళికూతురికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. పెళ్లికూతురితో పాటుగా వారి ఇంట్లో 7 మందికి కరోనా సోకింది అని తేలడంతో పెళ్లి చేసుకొని వారం కూడా తిరగకముందే పెళ్లి కొడుకు అత్తగారి ఇంటి నుండి మాయమైపోయాడు.
ఈ ఘటన గురించి పూర్తిగా చూస్తే .... కర్ణాటక లో ఉడిపి జిల్లాలో కాపు తాలుకా మల్లారిలోని కొంబగుడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతికి , శివమొగ్గ జిల్లా హోసనగరకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం అయ్యింది. పెళ్లి కూతురు ఇంట్లో, పెళ్లికి రెండు వారాల క్రితం చాలా అట్టహాసంగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి కూతురు తరపున చాలా మంది బంధువులు, కుటుంబ సభ్యులు మెహందీ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమంలో సందడి చేసారు. ఆ తరువాత పెళ్లి వేడుక కూడా చాలా అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి తంతు పూర్తి అయ్యేవరకు పెళ్లి కూతురు ,వారి కుటుంబ సభ్యులు అందరూ ఎంతో హుషారుగా కనిపించారు.
ఆ తరువాత పెళ్లి కూతురుకి కరోనా లక్షణాలు కనిపించడం తో ఆమెకు కరోనా నిర్దారణ పరీక్షా చేయగా ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసింది. జులై 6వ తేదీన పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ గా తేల్చారు. పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ గా తేలడంతో .. పెళ్ళికి ముందు గ్రాండ్ గా చేసిన మెహిందీ కార్యక్రమానికి వచ్చిన అందరికి కరోనా పరీక్షలు చేసారు. అందులో మరో 7 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం పెళ్లి కూతురు, ఆమె కుటుంబంలోని 7 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్ళికి ముందు జరిగిన మెహిందీ వేడుకలో సుమారుగా 80 మంది వరకు పాల్గొన్నారు అని అధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం ఇలా ఉంటే ఎన్నో ఊహలతో ఏవేవో ఆశలతో పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పెళ్లి కొడుకు అక్కడి నుండి మాయమైపోయాడు.