చనిపోయిన ఆ భార్య..ఆ భర్త గుండెల్లో పదిలంగా..
భార్య బతికి ఉండగానే వేరే మహిళలతో ఎఫైర్లు పెట్టుకునే ఈ రోజుల్లో భార్య చనిపోయినా ఆమె జ్ఞాపకాలతో బతుకు ఈడుస్తూ వేడుకల్లోనూ భార్య జ్ఞాపకంగా ఉంచుకున్న ఆ భర్త ప్రేమకు నిజంగానే ఎవరైనా ఫిదా కావాల్సిందే..
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాసగుప్తాకు భార్య అంటే పిచ్చిప్రేమ. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గుప్తా భార్య చనిపోయారు. అయితే ఆమె దూరాన్ని శ్రీనివాస్ గుప్తా తట్టుకోలేకపోయాడు. ఆమెతో పంచుకున్న జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాడు.
తాజాగా శ్రీనివాస్ గుప్తా గృహ ప్రవేశం చేశాడు. భార్యభర్తలిద్దరూ చేయాల్సిన ఈ కార్యక్రమంలో అకస్మాత్తుగా ఆయన భార్య ప్రత్యక్షమయ్యారు. వచ్చిన బంధుమిత్రులు అందరూ అవాక్కయ్యారు..! నిశితంగా పరిశీలించి చూస్తే అక్కడ కూర్చున్నది సజీవ మనిషి కాదు.
భార్య బతికి వుండగానే కొందరు భర్తలు చిత్ర హింసలకు గురిచేస్తున్న ఈ రోజుల్లో ఈ శ్రీనివాస గుప్తా సమ్ థింగ్ స్పెషల్. గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ పెద్దాయన. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే.. నేటి ఈ శ్రీనివాసుడు గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే తయారు చేయించాడు.!
చెప్తే గానీ తెలిసేలా లేదు "ఆమె" కాదు అది "విగ్రహమని". ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో.. ఈ అద్భుతాన్ని సృష్టించిన ఆ కళాకారులూ అభినందనీయులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.