గ్రేటర్ ఎన్నికలు కారుకు ఎంత భారీ డ్యామేజ్ చేశాయంటే?
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిని విశ్లేషించిన కొద్దీ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్లో 99 డివిజన్లను సొంతం చేసుకున్న 2016 నాటికి.. తాజాగా వెల్లడైన ఫలితాలను చూసినప్పుడు.. 44 డివిజన్లు కోల్పోయినట్లు కనిపిస్తుంది. డివిజన్ల సాధనలో మిగిలిన పార్టీల కంటే మెరుగ్గా ఉన్నప్పటికి.. ఫలితాల్ని విశ్లేషించి చూస్తే.. గులాబీ దళానికి వణుకు పుట్టే నిజాలు బయటకు వస్తున్నాయి.
గ్రేటర్ లోని 150 డివిజన్లు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ సాధించిన 55 డివిజన్లు కేవలం 11 నియోజకవర్గాలకే పరిమితమైంది. అంటే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యమే లేదన్నది చేదు నిజం. 2016లో ఈ డివిజన్లలో సగం గెలుచుకుంటే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా చతికిలపడింది. మరో షాకింగ్ అంశం ఏమంటే.. బీజేపీ భారీగా బలపడింది. తాజాగా ఆ పార్టీకి దక్కిన డివిజన్లు 48 మాత్రమే అయినప్పటికీ.. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల మాత్రమే ప్రాతినిధ్యం దక్కలేదు. అంటే.. టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా బోణీ కొట్టని అసెంబ్లీ నియోజకవర్గాలు 13 ఉంటే.. బీజేపీ కేవలం 6 మాత్రమే ఉండటం చూస్తే.. ఆ పార్టీ నగర వ్యాప్తంగా ఎంతలా విస్తరించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఒక్కచోట కూడా డివిజన్ ను దక్కించుకోలేదు. అందుకు భిన్నంగా బీజేపీ మాత్రం నాంపల్లి.. కార్వాన్.. చాంద్రాయణగుట్ట.. యాకుత్ పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు డివిజన్లను సొంతం చేసుకుంది. మరోవైపు 44 డివిజన్లు గెలుచుకున్న మజ్లిస్ సైతం గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 చోట్ల ఖాతా తెరవలేదు. దీన్ని చూస్తే.. టీఆర్ఎస్.. మజ్లిస్ కంటే కూడా బీజేపీనే నగర వ్యాప్తంగా విస్తరించిందని చెప్పాలి.