కరోనాదెబ్బకు.. వణికిపోయిన విదేశీ క్రికెటర్లు..!

Update: 2021-05-07 10:51 GMT
కరోనా మనదేశంలో ఏ రేంజ్​ లో విరుచుకుపడుతున్నదో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలోనే ఐపీఎల్ ను స్టార్ట్​ చేశారు. ఐపీఎల్​ లో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తున్నారు. బయోబబుల్​ లో అందరికీ ముందుగానే పరీక్షలు నిర్వహించి.. ఓ 21 రోజులు క్వారంటైన్​ లో ఉంచి జాగ్రత్తలు పాటించి ఆటగాళ్లను పంపించారు. అయనప్పటికీ కరోనా ఐపీఎల్​ కు పాకింది. కోల్ కతా ఆటగాళ్లలో ఇద్దరికీ, చెన్నై శిబిరంలో ముగ్గురికి,సన్​రైజర్స్​ హైదరాబాద్​ కు చెందిన వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహాకు మహమ్మారి సోకింది. దీంతో ఈ ఐపీఎల్​ ఆడుతున్న విదేశీ క్రికెటర్లు వణికిపోయారు.

ప్రస్తుతం దేశంలో కోవిడ్​ రోగులకు బెడ్లు సరిపోవడం లేదు. ఆక్సిజన్​ కొరత వేధిస్తున్నది. దీంతో తమకు కరోనా వస్తే పరిస్థితి ఏమిటి? అని విదేశీ క్రికెటర్లు భయపడుతున్నారు. నిజానికి క్రీడాకారులు ఎంతో ఫిట్​నెస్​ గా ఉంటారు. వాళ్లకు కరోనా సోకే అవకాశం తక్కువ. ఒకవేళ సోకినా తొందరగా నయమవుతుంది. కానీ ఒకవేళ వాళ్ల ద్వారా కుటుంబసభ్యులకు అంటే ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు, వృద్ధులకు సోకితేనే ప్రమాదం. అయితే ఇప్పటికే కొందరు క్రికెటర్లు ఐపీఎల్​ ను వీడి వెళ్లారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్​ అశ్విన్ ఐపీఎల్​ వాయిదాకు ముందే టోర్నీని విడిచిపెట్టాడు. అందుకు కారణం అతడి ఇంట్లో పలువురు కరోనా బారిన పడటమే.

ఈ విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ శ్రీవత్స్ గోస్వామి మాట్లాడుతూ.. ' కరోనాతో విదేశీ ఆటగాళ్లు భయంతో వణికిపోతున్నారు. స్వదేశీ ఆటగాళ్లు వాళ్లకు ధైర్యం నింపాలని చూస్తున్నప్పటికీ విదేశీ ఆటగాళ్లలో మాత్రం భయం పోవడం లేదు' అని గోస్వామి పేర్కొన్నారు.. మరోవైపు తమకు కరోనా సోకితే వైద్యం అందుతుందా? లేదా? అని విదేశీ ఆటగాళ్లు భయపడుతున్నారట. వాళ్లకు విదేశాల్లో హెల్త్​ ఇన్స్యూరెన్స్​ ఉంది. అది ఇండియాలో చెల్లుతుందో లేదో అని వాళ్లు అందోళన చెందుతున్నారు.

అయితే ఐపీఎల్​ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్వహించారు. అయినప్పటికీ కొందరికి కరోనా సోకడం అనుమానాలకు తావిస్తున్నది. గత ఏడాది యూఏఈలో ఐపీఎల్​ నిర్వహించారు. కానీ మనదగ్గర కొచ్చే సరికి నిర్వహణలో లోపం ఎదురైంది. దీంతో విదేశీ ఆటగాళ్లు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడడంతో ఆటగాళ్లు వారి వారి స్వదేశాలకు బయలుదేరారు. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది.
Tags:    

Similar News