మరీ సెకండ్ హ్యాండ్ టీంతో టీమిండియా గెలుపు ఎలా?

Update: 2023-01-28 10:32 GMT
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లేడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ లేడు. కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకొని దూరం అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా పెళ్లి చేసుకున్నాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా గాయంతో దూరం అయ్యాడు. మన రేసుగుర్రం బౌలర్  జస్ప్రీత్ బుమ్రా కూడా గాయంతో దూరమయ్యాడు. దీంతో మొత్తం సెకండ్ హ్యాండ్ టీం. ఎవరూ గట్టి ఆటగాళ్లు లేరు.  అలాంటి టీ20 టీంతో హర్ధిక్ పాండ్యా బలమైన న్యూజిలాండ్ తో తలపడ్డాడు.

కానీ తొలి మ్యాచ్ లో  ఘోరంగా ఓడిపోయింది. మన బౌలర్ అర్షదీప్ లాస్ట్ ఓవర్ లో 27 పరుగులు చేసి టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్ 176 పరుగులు చేరడానికి ఇదే కారణం. లేదంటే 150కే చాపచుట్టేసేది. ఇక ఇండియా 155 పరుగులే చేయగలిగింది. అర్ష్ దీప్ కనుక లాస్ట్ ఓవర్ మంచిగా వేసుంటే కథ వేరేలా ఉండేది.

టీమిండియాలో ప్రయోగాలు.. మార్పులే చేటు తెస్తున్నాయి. బలమైన టీంతో ఎప్పుడూ ఆడడం లేదు. ప్రయోగాల పేరిట ఎవరినో దింపేసి ఓడిపోతున్నారు. దేశవాళీలో పరుగుల వరద పారించిన ఫృథ్వీ షాను ఎంపిక చేసి మరీ నిన్న డకౌట్లో కూర్చోబెట్టారు.

అస్సలు ఆడించిన పాపాన పోలేదు. ఇక సరిగ్గా ఆడలేకపోతున్న ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. ఒక సెంచరీ చేయడం తర్వాత సైలెంట్ అయిపోవడం జరుగుతోంది. రాహుల్ త్రిపాఠి సైతం అదే కథ. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు గిల్, ఇషాన్ కిషన్, వన్ డౌన్ త్రిపాఠి 15 పరుగులకే ఔట్ కావడమే భారత్ ఓటమికి కారణమైంది.

మెరుగైన జట్టు ఉండగా.. ఆటగాళ్లందరినీ విశ్రాంతి పేరిట పక్కకు పెట్టడమే ఈ ఓటములకు కారణం. వన్డేల్లో న్యూజిలాండ్ ను 3-0తో ఓడించిన సంబురం మరిచిపోకముందే.. టీ20లో మాత్రం అదే టీం మనల్ని చిత్తుగా ఓడించింది. మరి ఈ గుణపాఠం నుంచి ఎలా నేర్చుకుంటారన్నది చూడాలి.

హార్ధిక్ పాండ్యాలాంటి బలమైన కెప్టెన్ ఉన్నా కూడా అతడికి సరైన వనరులు ఇవ్వడంలో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ విఫలం అవుతోంది. ఇప్పటికైనా జట్టును ఓ తోవలో నడిపిస్తేనే టీం పటిష్టంగా ఉంటుంది. లేదంటే ఇలానే ఓటములతో అథోగథి పాలవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News