15 ఏళ్ల బాలికపై కామాంధుడి కాటు..ఆర్నెల్లు అత్యాచారం..!

Update: 2020-09-01 14:00 GMT
ఆ బాలిక వయసు 15 ఏళ్లు. తల్లిదండ్రులు పేదోళ్లు. అమ్మ నాన్నలకు కాస్తయినా చేదోడుగా  ఉండేందుకు ఆ బాలిక ఓ  ఇంట్లో పనికి చేరింది. ఆ చిన్నారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఇంటి యజమాని ఆ బాలికపై కన్నేశాడు. బెదిరించి ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలిక బయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. చివరికి ఆ కామాంధుడి వల్ల ఆమెకు  గర్భం రావడంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు ఆ కామాంధుడిపై పోక్సో చట్టం నమోదు చేశారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణం బాలిరెడ్డి నగర్‌ కు చెందిన  దంపతులు కూలి పనులు చేసుకుంటూ బతుకు తున్నారు. వీరికి  కుమార్తె(15) ఉంది. ఇంటి వద్దే ఉంటున్న ఆ బాలిక తల్లిదండ్రులకు కాస్తయినా ఆసరాగా ఉండేందుకు యుగంధర్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు నెలల కిందట పనికి కుదిరింది. రోజూ వారింటికి వెళ్లి  ఇంటి  పని, వంట పని చేసేది.

 ఒంటరిగా వచ్చి వెళ్తున్న  ఆ బాలిక పైన యజమాని యుగంధర్ కన్నేశాడు. ఆమె అమాయకత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని బెదిరించి అత్యాచారం చేయడం మొదలు పెట్టాడు.ఈ తంతు ఆర్నెల్లుగా సాగుతోంది. ఇటీవల బాలిక  తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక శరీరంలో మార్పులు గమనించి పరీక్షలు జరుపగా ప్రస్తుతం ఆమె గర్భిణి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు యుగంధర్, అతడి భార్య పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:    

Similar News