లైవ్ లో పోర్న్ చూద్దామని ఓపెన్ చేసిన జంటకు..వారి వీడియోనే కనిపించింది

Update: 2020-02-04 04:41 GMT
కొన్ని ఉదంతాలు విన్నంతనే ఉలిక్కి పడేలా ఉంటాయి. తాజాగా చెప్పేది ఆ కోవకు చెందినదే. మన దేశానికి చెందిన ఉదంతం కాకున్నా.. తరచూ హోటళ్లకు వెళ్లే వారు.. విభిన్నమైన ప్రాంతాల్లో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ఉదంతం ఒక వార్నింగ్ లాంటిది. థాయ్ లాండ్ లోని ఒక హోటల్ కు ఒక జంట వెళ్లింది. మాంచి మూడ్ లో ఉన్న వారు.. ఆన్ లైన్ వెబ్ సైడ్ ఓపెన్ చేసి.. లైవ్ లో జరిగే రొమాన్స్ ను చూస్తూ సెక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగా ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఆ సైట్ లైవ్ లో వస్తున్న వీడియో ఎవరిదో కాదు.. వారిదే. తమ సెక్స్ కార్యక్రమాన్ని తామే లైవ్ లో చూసుకోవటంతో దిమ్మ తిరిగిపోయింది. అదెలా అంటే.. సదరు హోటల్ యాజమాని.. తన హోటల్లోని అన్నిగదుల్లో పలు చోట్ల రహస్య కెమేరాలు పెట్టి.. వాటిని పోర్న్ వెబ్ సైట్ కు లింక్ చేయటం ద్వారా భారీగా వెనకేస్తున్నాడు.

విషయాన్ని అర్థం చేసుకున్న జంటకు ఒళ్లు మండి పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయటం తో సదరు హోటల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా.. సదరు యజమాని దుర్మార్గం కారణంగా ఆ హోటల్లో బస చేసిన 800 మంది కస్టమర్ల సెక్స్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. పాపం.. ఆ హోటల్ కు వెళ్లటం అన్నది తామెంత తప్పు చేశామని వేదన చెందే పరిస్థితి. అందుకే.. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. బస చేసే చోట.. ఇలాంటి దరిద్రాలు ఏమైనా ఉన్నాయన్న విషయాన్ని ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా.


Tags:    

Similar News