కొనుగోళ్ల వీడియోలతో మోడీషాలపై కేసీఆర్ సంచలన ఆరోపణలు

Update: 2022-11-03 16:07 GMT
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రికార్డ్ చేసిన వీడియోలను బయటపెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ పెను సంచలనానికి తెరతీశాడు. ఆ వీడియోల్లో ఇదంతా అమిత్ షా , బీఎల్ సంతోష్ ల ప్రోద్బలంతోనే తాము చేస్తున్నామని ముగ్గురు నిందితులు మాట్లాడడం పెనుదుమారం రేపింది. మోడీ పేరు కూడా రెండు సార్లు ప్రస్తావనకు రావడంతో సంచలనమైంది.

దేశంలో ప్రజాస్వామ్యం హననం అవుతోందని.. బాధతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పిన కేసీఆర్.. టీఆర్ఎస్ కొనుగోళ్లకు సంబంధించిన మూడు గంటల వీడియోను రిలీజ్ చేసి బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో పెద్ద తలకాయల పేర్లు బయటపడడం.. అమిత్ షా పేరు ఉండడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

నెల రోజుల క్రితమే ఈ కొనుగోళ్లు షూరు అయ్యాయని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 100 కోట్లు ఇస్తామన్నా వదిలేసి తెలంగాణను బతికించారని కేసీఆర్ కొనియాడారు. తాండూర్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినా లొంగలేదని.. తెలంగాణ ఆత్మను కాపాడారన్నారు. వీడియో ఫుటేజీ 3 గంటల పాటు ఉందని.. కోర్టుకు సమర్పించామని.. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ తోపాటు మిగతా ప్రభుత్వాలను కూల్చేస్తామని అన్న విషయాలన్నీ అందులో ఉన్నాయని కేసీఆర్ సంచలన వీడియోలు బయటపెట్టాడు.

ఇక ఈ ముఠాలోని ముగ్గురు వ్యక్తులకు 3 ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్న ఆధారాలను బయటపెట్టారు. వారి కాల్ డేటాలో 2015 నుంచి ప్రభుత్వాలను కూల్చిన ఆధారాలు ఉన్నాయని.. వెంటనే దీనికి బాధ్యులైన వారు బయటకు రావాలంటూ కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఈవీఎంలు ఉన్నంత వరకూ బీజేపీకి ఢోకా లేదని వాళ్లు చెబుతున్నారని.. విపక్ష పార్టీలను కూల్చే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నాని.. దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరూ క్షమించరన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించాలని.. రాజ్యాంగేతర శక్తుల వీరవిహారాన్ని అరికట్టకపోతే అందరికీ ప్రమాదం అని కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు. ప్రతి ఆధారాన్ని మీడియాకు, కోర్టుకు ఇచ్చామని.. మీడియా, ప్రజలు బీజేపీ కుట్రలను ఛేదించాలని కేసీఆర్ పిలుపునిచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News