అమ్మఒడి అడిగినందుకు విద్యార్థిని చితకబాదిన హెచ్‌ఎం ..వీడియో వైరల్
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకాల్లో ఒకటి అమ్మఒడి. ప్రతి పిల్లవాడికి సీఎం జగన్ మేనమామ లా ఉంటాడు అంటూ మీరు స్కూల్ కి పంపండి నేను మీ అకౌంట్ లో డబ్బులు వేస్తా అని ప్రజాసంకల్ప యాత్ర లో చెప్పాడు. చెప్పిన విధంగానే .. సీఎం జగన్ ఆ తర్వాత అమ్మఒడి ని అమల్లోకి తీసుకువచ్చాడు. ఇదిలా ఉంటే అమ్మఒడి డబ్బు రాలేదు సార్ అని ఓ విద్యార్థి హెచ్ ఎం ను అడిగితే , సమాధానం చెప్పాల్సిన ఆ హెచ్ ఎం .. ఇష్టానుసారముగా ఆ విద్యార్థిని చితకబాదాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ మాస్టర్ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే ... కశింకోట మండలం ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది ఎనిమిదో తరగతి చదివిన రూపేష్ కు అమ్మఒడి పథకం వర్తించలేదు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అమ్మఒడి పథకం వచ్చేలా చూడాలని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శర్మను కలిశారు. సాంకేతిక కారణాలతో సమస్య వచ్చిందని ఆయన చెప్పారు. అంతటితో ఆ విషయాన్ని వదిలేశారు.
రూపేష్ ఈ ఏడాది ఏనుగుతుని స్కూల్ కాకుండా నర్సింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేరాడు. అమ్మఒడి పథకం గురించి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ను అడిగాడు.. ఆయన ముందు చదివిన స్కూల్ హెచ్ ఎం అప్ లోడ్ చేశారా, లేదా తెలుసుకుని రమ్మని చెప్పారు. రూపేష్ ఏనుగుతుని స్కూల్ హెచ్ ఎం శర్మను కలిశాడు.
అమ్మఒడి గురించి అడగడంతో శర్మ కోపంతో ఊగిపోయారు. చెంప చెల్లుమనిపించాడు. విద్యార్థిని రోడ్డుపైకి లాక్కొచ్చి ఎంత ధైర్యం అంటూ చితక బాదాడు. దీన్ని స్థానికులు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడి ఘటనపై హెడ్ మాస్టర్ శర్మ స్పందించారు. తనతో విద్యార్థి రూపేష్ అమర్యాదగా ప్రవర్తించాడని.. అతడి తండ్రి తాగొచ్చి దురుసుగా ప్రవర్తించాడన్నారు. అందుకే మందలించానని చెప్పారు. అమ్మఒడి పథకం బ్యాంకు ఖాతా తప్పుపడడంతో విద్యార్థికి పథకం అందలేదన్నారు. ఈ దాడి ఘటనపై విద్యాశాఖ అధికారులు ఇంకా స్పందించలేదు.